ప‌వ‌న్.. బ్లాక్ లో టికెట్ల‌మ్మేవాడి వాద‌న‌లాగుంది!

ఇండ‌స్ట్రీని కాపాడేది కేవ‌లం పెద్ద సినిమాలు మాత్ర‌మే కాదు, పెద్ద సినిమాకు ఎంత‌మంటి టెక్నీషియ‌న్లు పని చేస్తారో, చిన్న సినిమా కూడా అంతే మందికి అన్నం పెడుతుంది.  Advertisement పెద్ద సినిమా అంటే.. కేవ‌లం…

ఇండ‌స్ట్రీని కాపాడేది కేవ‌లం పెద్ద సినిమాలు మాత్ర‌మే కాదు, పెద్ద సినిమాకు ఎంత‌మంటి టెక్నీషియ‌న్లు పని చేస్తారో, చిన్న సినిమా కూడా అంతే మందికి అన్నం పెడుతుంది. 

పెద్ద సినిమా అంటే.. కేవ‌లం హీరోకి అందే పారితోష‌కం భారీ స్థాయిలో ఉంటుంటి, వీలైతే విదేశాల్లో పాట‌ల‌ను తీసుకుని వ‌స్తుంది త‌ప్ప‌ పెద్ద సినిమాలో ఏమీ ఒక సంవ‌త్స‌రం పాటు ఇండ‌స్ట్రీలోని టెక్నీషియ‌న్ల‌కు జీత‌భ‌త్యాల‌ను ఇవ్వ‌దు. ఒక సంవ‌త్స‌రంలో వ‌చ్చే సినిమాల సంఖ్య‌ను లెక్క‌బెడితే, వాటిల్లో పెద్ద సినిమాలు ప‌దో, ప‌న్నెండో ఉంటే, చిన్న సినిమాల సంఖ్య వంద‌కు పైనే ఉంటుంది!

చిన్న సినిమాల‌కు టికెట్ల రేట్లు అధికంగా అక్క‌ర్లేదు, త‌మ‌కు థియేట‌ర్లు ద‌క్కితే చాలు మొర్రో అని చిన్న సినిమాల నిర్మాత‌లు మొత్తుకోని రోజులు పోతే చాలు! ప్రేక్ష‌కులు అధిక ధ‌ర‌ల‌కు టికెట్లు కొని బ‌తికించాల్సింది కేవ‌లం పెద్ద సినిమాల‌ను, పెద్ద సినిమాల్లోని హీరోల‌ను త‌ప్ప‌, చిన్న సినిమాకు ఈ లెక్క‌ల‌తో సంబంధ‌మే లేదు! 

ఆన్ లైన్ పోర్ట‌ల్ తో పార‌ద‌ర్శ‌క విధానం ఏర్ప‌డుతుంది. ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు, పార‌ద‌ర్శ‌క‌మైన ఈ విధానాన్ని ఆహ్వానించాల్సిన ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి సామాజిక బాధ్య‌త ఉంద‌ని చెప్పుకునే హీరో.. ఎందుకు దాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్టు?  మాటెత్తితే ప‌వ‌న్ క‌ల్యాణ్ నోటి నుంచి భ‌గ‌త్ సింగ్ ద‌గ్గర నుంచి గ‌ద్ద‌ర్ వ‌ర‌కూ ర‌క‌ర‌కాల పేర్లు వ‌స్తూ ఉంటాయి! 

త‌న‌కు ఉన్న సామాజిక బాధ్య‌త గురించి ప‌వ‌నే క‌ల్యాణే ర‌క‌ర‌కాలుగా చెప్పుకుంటూ ఉంటారు! అన్నింటికీ మించి ప్ర‌శ్నించ‌డానికే పార్టీ అన్నారు! అలాంటిది… పార‌ద‌ర్శ‌క‌మైన ఆన్ లైన్ ప‌ద్ధ‌తిని ప్ర‌భుత్వ తెస్తానంటే ఎందుకు గ‌గ్గోలు పెడుతున్న‌ట్టు? ఎందుకు దాన్ని త‌న‌పై దాడిగా చిత్రీక‌రిస్తున్న‌ట్టు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘోష‌ను గ‌మ‌నిస్తే.. న‌ల్ల వ్యాపారం చేసుకోనివ్వ‌డానికి అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని గ‌గ్గోలు పెట్టిన‌ట్టుగా ఉంది. సినిమాల‌కు సంబంధించి ఏదీ పార‌ద‌ర్శ‌క‌త అక్క‌ర్లేదు, ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు, ఎంత‌కు అమ్ముతున్నారు? అనే దాని గురించి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకూడ‌దు! థియేట‌ర్ల యాజ‌మాన్యాలు, సినిమా వాళ్లు క‌లిపి ఈ బ్లాక్ మార్కెట్ చేసుకోవాలి! 

థియేట‌ర్ బ‌య‌ట బ్లాక్ టికెట్ లు అమ్మితే నేరం, అదే సినిమా వాళ్లే మొత్తం బ్లాక్ మార్కెట్ చేసుకుంటే అది మాత్రం వారి వ్యాపార‌మా! బ్లాక్ లో టికెట్లు అమ్మే వాడిని తీసుకెళ్లి స్టేష‌న్లో వేస్తారు, వాన్నో నేర‌స్తుడు అన్న‌ట్టుగా థియేట‌ర్ల ప‌రిస‌రాల్లో క‌న‌ప‌డ‌నివ్వ‌రు! అదే త‌మ సినిమా త‌మ టికెట్లు అని వాదించే హీరో వాద‌న మాత్రం రైట‌వుతుందా? ఇదేం నీతి?