పవన్ మూడు రోజుల మౌనవ్రతం

ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో వ్యాఖ్యానం చేయడం పవన్ కల్యాణ్ కి అలవాటు. అర నిమిషం ఆలోచించి, మరో అర నిమిషంలో ట్వీట్ చేసి, ఆపై మిగతా టైమ్ అంతా ట్రోలింగ్ కి గురికావడం…

ఎలాంటి క్లిష్ట సమస్యకైనా చిటికెలో వ్యాఖ్యానం చేయడం పవన్ కల్యాణ్ కి అలవాటు. అర నిమిషం ఆలోచించి, మరో అర నిమిషంలో ట్వీట్ చేసి, ఆపై మిగతా టైమ్ అంతా ట్రోలింగ్ కి గురికావడం ఆయనకు ఆనవాయితీ. అలాంటి పవన్ రాజధాని అంశంపై కేబినెట్ భేటీ తర్వాత దాదాపు మూడు రోజులు సైలెంట్ గా ఉండబోతున్నారు.

జగన్ అసెంబ్లీ ప్రకటన తర్వాత పొరపాటున ట్వీటుజారి.. పశ్చాత్తాప పడటానికి కూడా వీలు లేకుండా రెండు ప్రాంతాల ప్రజలతో నానా చీవాట్లు తిన్న పవన్ కల్యాణ్.. కేబినెట్ భేటీ తర్వాత మాత్రం ఎందుకో రోజుల తరబడి మౌనాన్నే ఆశ్రయించబోతున్నారు. ఈనెల 30న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం, పరోక్షంగా పవన్ మౌనంపై క్లారిటీ ఇచ్చింది.

ఈరోజు సాయంత్రానికి మూడు రాజధానులపై కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు బైటకొస్తాయి. పవన్ కల్యాణ్ స్పందించాలి అనుకుంటే..కేబినెట్ భేటీ వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి చదివి వినిపించిన వెంటనే ట్వీట్లు మొదలు పెట్టొచ్చు. కానీ ఆ అవకాశం ఇప్పుడు లేదనమాట. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని 28, 29 అధ్యయనం చేస్తారు, 30వ తేదీ తమ పార్టీ విస్తృత సమావేశంలో సీరియస్ గా చర్చిస్తారు. ఆ తర్వాత తీరిగ్గా దానిపై వ్యాఖ్యానిస్తారన్న మాట.

అంటే దాదాపు మూడు రోజుల పాటు మేథోమథనం జరుగుతుంది. అందుకే ముందస్తుగా విస్తృత స్థాయి సమావేశం గురించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒకరకంగా జనసైనికుల నోటికి కూడా తాళం వేశారు. ఎవరూ తొందరపడి నోరుజారొద్దు, అనవసర రాద్ధాంతం చేయొద్దు అని హెచ్చరించేందుకే ఈ ప్రెస్ నోట్. అయితే రాజధానిపై పవన్ యూ టర్న్ తీసుకున్నారనే విషయం ఆ ప్రెస్ నోట్ లోనే బైటపడింది.

రాజధాని రైతుల కష్టాలకు తోడు, మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, పార్టీ స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు.. అంటూ మరికొన్ని అంశాలు జోడించారు. ఆశలు, ఆకాంక్షలు అంటున్నారంటే.. పవన్ ఆ దిశగా ఆలోచన మొదలు పెట్టారనే అర్థమవుతుంది. సో.. పవన్ కల్యాణ్ మూడు రోజుల తర్వాత స్పందించే విషయం కూడా ఇప్పుడే స్పష్టమవుతోంది. కేబినెట్ నిర్ణయం ఎలా ఉన్నా.. పవన్ ఈనెల 30న మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలపబోతున్నారనేది తేలిపోయింది.

DSP తో మాట్లాడి 6 నెలలు అయింది