పవన్ రికార్డ్: ఆరేళ్ళలో ఆరు పార్టీలు!

రాజకీయాల్లో ఆటుపోట్లు ఎన్నో తిన్నా, ఆరితేరిపోయానని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు. తాను పాతికేళ్ళ రాజకీయం చేయడానికి వచ్చానని చెప్పుకునే జనసేనాని బాల్యావస్థలోనే ఎన్నో రికార్డులు సాధించేశారు. Advertisement పార్టీ పెట్టిన ఆరేళ్ళల్లోనే…

రాజకీయాల్లో ఆటుపోట్లు ఎన్నో తిన్నా, ఆరితేరిపోయానని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు. తాను పాతికేళ్ళ రాజకీయం చేయడానికి వచ్చానని చెప్పుకునే జనసేనాని బాల్యావస్థలోనే ఎన్నో రికార్డులు సాధించేశారు.

పార్టీ పెట్టిన ఆరేళ్ళల్లోనే ఆరు పార్టీలతో పొత్తు పొడుపులు, విడాకులు ఇలా పవన్ పార్టీ రికార్డుల కధ చెప్పతరమా. మరో వైపు చూసుకుంటే పోటీ చేసిన రెండు చోట్ల అధ్యక్షుడు ఓడిపోవడం అంటే అది కూడా ఒక రికార్డే.

ఇన్ని రికార్డులు సాధించిన పవన్ కళ్యాణ్ కి పిరికి స్టార్ అని బిరుదు ఇస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే అమరనాధ్. పవన్ కళ్యాణ్ లో ఎంత పిరికితనం లేకపోతే ఇలా కన‌బడిన ప్రతీ పార్టీతో పొత్తుకు ఎగబడతారంటూ  ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

జనాలకు ధైర్యం నూరిపోయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్న పవన్ ఎంతటి ధైర్యవంతుడో ఆయన రెండు సీట్లలో పోటీ చేసినపుడే అర్ధమైపోయిందని అంటున్నారు. అందువల్ల పవర్ స్టార్ కాదు ఆయన్ని  పిరికి స్టార్ అని  పిలుచుకోవాలని  గుడివాడ సెటైర్లు  వేస్తున్నారు.

జనాలను మభ్యపెట్టడంలో  చంద్రబాబుని పవన్  మించిపోయారని కూడా గుడివాడ అంటున్నారు. మొత్తానికి ఆరేళ్ళల్లోనే ఇన్ని రికార్డులు సొంతం చేసుకున్న పవన్ నిజంగా పాతికేళ్ళ రాజకీయం చేస్తే దేశంలోని పార్టీలన్నీ పొత్తులకు సరిపోతాయా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

ఎలక్షన్ అధికారిపై జగన్ ఫైర్..

చిరంజీవి సినిమా షూటింగ్ ఆపేసారు