మిత్రపక్షమైన బీజేపీకి ‘భీమ్లానాయక్’ హీరో పవన్‌కల్యాణ్ షాక్ ఇచ్చారా? అంటే, ఔననే సమాధానం వస్తోంది. అసలే టీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ మండిపడుతున్న నేపథ్యంలో, ‘భీమ్లానాయక్’ ప్రమోషన్స్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించడం పుండు మీద కారం చల్లడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ‘భీమ్లానాయక్’ పేరుతో తెలుగులో తెరకెక్కించారు. ఈ సినిమా హీరో పవన్‌కల్యాణ్. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 21న హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
ఇటీవల జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా మోదీ సర్కార్‌తో పాటు బీజేపీని కేసీఆర్ చాకిరేవు పెడుతున్నారు. ఈ దశలో తమ మిత్రపక్షంగా ఉన్న పవన్‌కల్యాణ్ …తెలంగాణ మంత్రిని తన సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి ఆహ్వానించడంపై సహజంగానే ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
పవన్‌కల్యాణ్ అభిప్రాయం మేరకే కేటీఆర్‌ను ఆహ్వానించి వుంటారని బీజేపీ భావిస్తోంది. గతంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అభ్యర్థికి జనసేనాని మద్దతు పలకడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాజకీయాల్లో ఓ పాలసీ లేకుండా జనసేనాని నడత ఉందని తెలంగాణ బీజేపీ మండిపడుతోంది. తమ పార్టీపై విముఖతతోనే కేసీఆర్‌కు దగ్గరయ్యేందుకు పవన్ ఆడుతున్న డ్రామాగా బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజకీయాలు, కళలు వేర్వేరని పవన్ అభిమానులు చెబుతున్నారు.
భీమ్లానాయక్ ఫంక్షన్‌కు కేటీఆర్ ఆహ్వానించడాన్ని కేవలం సినిమా దృష్టితో మాత్రమే చూడాలనేది జనసేన కార్యకర్తల అభిప్రాయం. కేసీఆర్, కేటీఆర్‌తో పవన్ సంబంధాలు కేవలం సినిమాకే పరిమితమా లేక రాజకీయాల్లో కూడా ఎంటర్ అవుతాయా? అనేది కాలమే జవాబు చెప్పాల్సి వుంది.