ఇటు జనసేన, అటు బీజేపీ.. మధ్యలో పవన్ కల్యాణ్

అదేంటి.. జనసేన పార్టీ పవన్ కల్యాణ్ దే కదా. మరి ఆయనెందుకు కార్నర్ అవుతాడు? జనసేన-బీజేపీ మధ్యలో ఆయన నలిగిపోవాల్సిన అవసరం ఏముంది? Advertisement నిజంగానే జనసేన, బీజేపీ మధ్య పవన్ నలిగిపోతున్నారు. ఓవైపు…

అదేంటి.. జనసేన పార్టీ పవన్ కల్యాణ్ దే కదా. మరి ఆయనెందుకు కార్నర్ అవుతాడు? జనసేన-బీజేపీ మధ్యలో ఆయన నలిగిపోవాల్సిన అవసరం ఏముంది?

నిజంగానే జనసేన, బీజేపీ మధ్య పవన్ నలిగిపోతున్నారు. ఓవైపు తన మనసు చంపుకొని, మరోవైపు బీజేపీ లాబయింగ్ కు తలొగ్గి, మధ్యేమార్గంగా నాదెండ్లతో ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం…

ఏపీలో కరోనా నివారణ చర్యల్లో జగన్ ప్రభుత్వ పనితీరు భేష్ అంటూ ఇటీవలే పవన్ కల్యాణ్ ప్రశంసించారు. 108 సర్వీసుల ప్రారంభం సందర్భంగా ఆయన జగన్ సర్కారుని అభినందించారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అంటూ పవన్ సంబోధించే సరికి మనిషి మారాడని అనుకున్నారంతా. కానీ బీజేపీకి మాత్రం అది నచ్చలేదు.

ఊహించని విధంగా జగన్ ని పవన్ కల్యాణ్ పొగిడే సరికి కమలానికి పొత్తు ధర్మం గుర్తొచ్చింది. అంబులెన్స్ లకు సమకూర్చిన నిధుల్లో కేంద్రానికి కూడా వాటా ఉందని బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. మరి వన్ సైడ్ గా జగన్ ని పవన్ పొగిడితే ఊరుకుంటుందా. అందుకే జనసేనాని దగ్గర తమ అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. దీంతో హడావిడిగా ఇరు పార్టీల నేతలు ఓ ప్రెస్ నోట్ బైటకు వదిలారు.

కరోనా అరికట్టడంలో ఏపీ ప్రభుత్వం సమర్థంగా పనిచేయడంలేదని తేల్చి చెప్పారు రెండు పార్టీల మేథావులు. వైద్య సిబ్బంది రక్షణలో ఉదాసీనంగా ఉన్నారని విమర్శించారు. అయితే తెలివిగా ఈ ప్రెస్ నోట్ ని నాదెండ్ల మనోహర్ పేరుతో బైటకి వదిలారు.

మొత్తమ్మీద జగన్ ని పవన్ ప్రశంసించడం బీజేపీకి ఏమాత్రం ఇష్టంలేదనే విషయం ఈ ప్రెస్ నోట్ తో తేలిపోయింది. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై పవన్ కి సదాభిప్రాయమే ఉన్నా.. బీజేపీ ఒత్తిడిలో ఉన్న ఆయన తన నిర్ణయాలను స్వతంత్రంగా చెప్పలేకపోతున్నారు. పొత్తు నిబంధనల్లో భాగంగా బీజేపీకి వంతపాడటమే పనిగా పెట్టుకున్నారు పవన్.

ఇప్పుడు పైన మనం చెప్పుకున్న హెడ్డింగ్ ను మరోసారి చూడండి.. మేటర్ మొత్తం అర్థమౌతుంది.

కరోనా చికిత్సకి రెండువేలు ఖర్చయింది

హరీష్ శంకర్ తో సినిమా చేస్తాను