లోకేష్ మిగిల్చిన కామెడీని పవన్ పండిస్తారట

సినిమాల్లో పవర్ స్టార్ కానీ, రాజకీయాల్లో మాత్రం పవర్ లెస్ స్టార్ పవన్ కల్యాణ్. అక్కడ హీరో, ఇక్కడ మాత్రం ఆయన కమెడియన్. ఏపీ రాజకీయాల్లో మరో మంచి కమెడియన్ నారా లోకేష్ తో…

సినిమాల్లో పవర్ స్టార్ కానీ, రాజకీయాల్లో మాత్రం పవర్ లెస్ స్టార్ పవన్ కల్యాణ్. అక్కడ హీరో, ఇక్కడ మాత్రం ఆయన కమెడియన్. ఏపీ రాజకీయాల్లో మరో మంచి కమెడియన్ నారా లోకేష్ తో పవన్ పదే పదే పోటీ పడుతుంటారు. వీరిద్దరికీ పోటీ ఇచ్చే కేఏ పాల్ ఇప్పుడు కనిపించకపోవడంతో ప్రధాన పోటీ లోకేష్, పవన్ మధ్యే జరుగుతోంది.

ఆమధ్య భారీ వర్షాల నేపథ్యంలో నారా లోకేష్ మోకాలి లోతు నీళ్లలో నిలబడి నవ్వులు పూయించారు. వరి దుబ్బుల్ని వేర్లు పైకి, గింజలు కిందకి పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చి నవ్వులపాలయ్యారు. రైతుల గురించి, వ్యవసాయం గురించి తెలియని నాయకులు ఇలా పరామర్శలకు రావడమే విడ్డూరమైతే.. అదేదో తమకి బాగా తెలిసిన సబ్జెక్ట్ లా ఫీలై ఓవర్ యాక్షన్ చేయడం మరింత విడ్డూరం.

ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలు కాబోతోంది. లోకేష్ మిగిల్చిన కామెడీని ఇప్పుడు జనసేనాని పండించబోతున్నారు. కరోనా కష్టకాలంలో చాతుర్మాస దీక్ష పేరుతో ఇంటి పట్టున ఉండిపోయిన పవన్ కల్యాణ్, తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రైతుల పరామర్శ యాత్రకు బయలుదేరడం రాజకీయ లబ్ధి కోసం కాక మరేంటి?

రేపటి నుంచి రెండు రోజులపాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించే పవన్ ఆ తర్వాత మూడు రోజులు తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లోకి వచ్చే నియోజకవర్గాల్లో తిరిగేలా ప్లాన్ చేసుకున్నారు. రైతులను పరామర్శించడం, వారిని ఓదార్చడం ప్రధాన అజెండా. తిరుపతి బైపోల్ పరిస్థితుల్ని అంచనా వేయడం అనేది హిడెన్ అజెండా.

ఎన్ని అజెండాలు మనసులో ఉన్నా.. చివరకు కార్యకర్తల్ని మరో పార్టీ జెండాకు జై కొట్టాలని చెప్పేరకం కాబట్టి.. పవన్ హిడెన్ అజెండాని అప్పుడే పరిగణలోకి తీసుకోలేం. గతంలో పవన్ కల్యాణ్ పరామర్శ యాత్రలు చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఫోజులు అందరికీ గుర్తున్నాయి కూడా. 

చెట్టుకింద ముంతలో పెరుగన్నం తినడం, రైలు పెట్టెలో టాయిలెట్స్ దగ్గర నిలబడి పుస్తకాలు చదవడం, కారు డిక్కీలో కూర్చుని టీ తాగడం.. అబ్బో చాలా పాత్రల్ని ఆయన అవలీలగా పోషించారు.

ఇప్పుడు ఐదురోజుల ఈ యాత్రలో మరింత కామెడీ చూడాల్సి రావడం మాత్రం ఖాయం. లోకేష్ మిగిల్చిన వరదలో బురద కామెడీ ఎపిసోడ్ ని పవన్ కల్యాణ్ కొనసాగిస్తాడనడంలో ఎలాంటి అనుమానం లేదు.

గతంలో కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏదో ఒక కార్యక్రమంలో హడావిడి చేసిన పవన్ కల్యాణ్.. శీతాకాల సమావేశాలు మొదలవగానే.. ఇలా టూర్ తో జనాల్లోకి వస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే అర్హత లేకపోయినా ఇలా తనపై కూడా పబ్లిక్ అటెన్షన్ ఉండేట్టు ప్లాన్ చేసుకున్నారు. 

చంద్రబాబుకు అల్జీమర్స్ జబ్బుంది: కొడాలి నాని