పాపం.. పవన్ పరువు మొత్తం పాయె

“గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ఝలక్.. పొత్తును పక్కనపెట్టి బీజేపీకి పోటీగా బరిలో దిగుతున్న జనసేన..” మొన్నటివరకు మా పవన్ పొలిటికల్ హీరో, తెలంగాణ కింగ్ అనే రేంజ్ లో ఇలాంటి ప్రకటనలు చూశాం.…

“గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ ఝలక్.. పొత్తును పక్కనపెట్టి బీజేపీకి పోటీగా బరిలో దిగుతున్న జనసేన..” మొన్నటివరకు మా పవన్ పొలిటికల్ హీరో, తెలంగాణ కింగ్ అనే రేంజ్ లో ఇలాంటి ప్రకటనలు చూశాం. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమనే విషయం ఈ రోజుతో తేలిపోయింది. 

బీజేపీతో పొత్తు కోసం, కమలంతో కలిసి  గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసేందుకు పవన్ ఎంత తహతహలాడుతున్నారో ఈరోజు జరిగిన కీలక పరిణామాలతో అందరికీ తెలిసొచ్చింది. 

ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల మధ్య పొత్తు కోసం జనసేన ఎంతలా అర్రులు చాస్తోందో, జనసేనను బీజేపీ ఎలా తీసి పక్కన పడేసిందో స్పష్టమైంది. ఉదయం నుంచి జరిగిన పరిణామాల్ని ఒక్కొక్కటిగా చూద్దాం..

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం జనసేన పార్టీ తెరవెనక చేయని ప్రయత్నం లేదు. కానీ బీజేపీ మాత్రం సొంతంగానే పోటీచేస్తామని కొన్ని రోజులుగా విస్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయాలని జనసేన పార్టీ భావించింది. అయితే అంతలోనే పవన్ ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

బీజేపీతో పొత్తులపై చర్చలు ప్రారంభమౌతాయని పవన్ ప్రకటించారు. ఈ మేరకు జనసేన నుంచి ప్రెస్ నోట్ కూడా రిలీజైంది. మధ్యాహ్నం ఈ ప్రెస్ నోట్ విడుదలైంది. అయితే ఇది రిలీజైన కొద్దిసేపటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పవన్ గాలి తీసేశారు. 

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జనసేనతో ఎలాంటి పొత్తు ఉండబోదని మరోసారి స్పష్టంచేశారు.జనసేన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కు, తెలంగాణ బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారాయన.  

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి దాదాపు అందరు అభ్యర్థుల్ని ఖరారు చేశామని.. కేవలం 2-3 డివిజన్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా మరికొన్ని గంటల్లో ఖరారుచేస్తామని బండి సంజయ్ విస్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి టైమ్ లో పవన్ తో చర్చల ప్రక్రియ ప్రారంభించి ఉపయోగం లేదని కూడా ఆయన కుండబద్దలుకొట్టారు.

పాపం.. పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీ అధిష్టానం చర్చలకొస్తుందని పొద్దున్నుంచి ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ లో సోలోగా దిగేంత సీన్ జనసేనకు లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని డివిజన్లలో నిలబెట్టడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరు. అందుకే లోపాయికారీగా బీజేపీతో చేతులు కలిపి మమ అనిపిద్దాం అనుకున్నారు. తీరా ఇప్పుడు బీజేపీ రివర్స్ అవ్వడంతో పవన్ పరువు పోయింది.

పొద్దున్నుంచి చర్చల కోసం ఎదురుచూసిన పవన్.. ఇప్పుడు అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. మరికాసేపట్లో జనసేన పార్టీ నుంచి అభ్యర్థుల జాబితా విడుదలకానుంది. 

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు