‘క్రేజీ అంకుల్స్’ వస్తున్నారు

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను రూపొందించే కార్యక్రమంలో భాగంగా గుడ్ సినిమా నిర్మిస్తున్న సినిమా క్రేజీ అంకుల్స్.  గాయకుడు మనో, పోసాని, రాజా రవీంద్ర, తనికెళ్ల తో పాటు శ్రీముఖి…

కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను రూపొందించే కార్యక్రమంలో భాగంగా గుడ్ సినిమా నిర్మిస్తున్న సినిమా క్రేజీ అంకుల్స్.  గాయకుడు మనో, పోసాని, రాజా రవీంద్ర, తనికెళ్ల తో పాటు శ్రీముఖి ముఖ్య పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `క్రేజీ అంకుల్స్`. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న‌ ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మిన‌హా పూర్త‌య్యింది. 

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో.. ప్ర‌ముఖ గాయకుడు, న‌టుడు మ‌నో మాట్లాడుతూ  – “క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించాను  ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూసే సినిమా ఇది. రాజారవీంద్ర‌, శ్రీముఖి తో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. క్రేజి అంకుల్స్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు

న‌టుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ – “ఈ సినిమాలో యోగ టీచర్ గా కనిపించబోతున్నాను.  మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ త‌ప్ప‌కుండా  అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది“ అన్నారు.

నిర్మాత‌ శ్రీవాస్ మాట్లాడుతూ – “శ్రేయాస్ శ్రీను నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న టైమ్ లో నాకు రైటర్ డార్లింగ్ స్వామి  చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకొని చేసిన చిత్ర‌మిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి రోల్స్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. డైరెక్టర్ సత్తిబాబు స్క్రిప్ట్ ను బాగా హ్యాండిల్ చేశారు. 

న‌టుడు రాజా రవీంద్ర మాట్లాడుతూ – `నేను ఈ మధ్య కాలంలో  చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్ ఇది. శ్రీవాస్ కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సినిమా షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది“ అన్నారు.

న‌టి శ్రీముఖి మాట్లాడుతూ  టీవీలో ఎక్కువగా షోస్ చేస్తున్న నేను క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఒక పాట మిన‌హా దాదాపు షూటింగ్ పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఆ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుప‌బోతున్నాం. . గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు  ఇ. సత్తిబాబు మాట్లాడుతూ – “గుడ్ సినిమా బ్యాన‌ర్‌లో రాబోతున్న క్రేజీ అంకుల్స్  చాలా ఫన్నీగా అందరిని అలరించే విధంగా ఉంటుంది.  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ అంద‌రం ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది“ అన్నారు.