రకుల్ కూడా అక్కడికే చేరుకుంది

తాప్సి, మెహ్రీన్, ప్రణీత వెళ్లి వచ్చారు. కాజల్ హనీమూన్ కూడా అక్కడే. ఇప్పుడీ లిస్ట్ లోకి రకుల్ కూడా చేరిపోయింది. అవును.. రకుల్ కూడా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ఇవాళ్టి నుంచి ఆమె ఎంజాయ్…

తాప్సి, మెహ్రీన్, ప్రణీత వెళ్లి వచ్చారు. కాజల్ హనీమూన్ కూడా అక్కడే. ఇప్పుడీ లిస్ట్ లోకి రకుల్ కూడా చేరిపోయింది. అవును.. రకుల్ కూడా మాల్దీవుల్లో ల్యాండ్ అయింది. ఇవాళ్టి నుంచి ఆమె ఎంజాయ్ మెంట్ షురూ అయింది.

ఇలా వెళ్లడమే ఆలస్యం అలా బికినీ వేసి ఓ ఫొటో దిగి పోస్ట్ చేసింది. సముద్రం-వాసన, ఆకాశం-అనుభూతి, ఊహలు-రెక్కలు అంటూ ఓ కొటేషన్ కూడా తగిలించింది. లక్స్ సౌత్ యారి అనే ఫైర్ స్టార్ రిసార్ట్ లో ప్రస్తుతం సేదతీరుతోంది రకుల్.

లాక్ డౌన్ తర్వాత ఒకేసారి 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చింది రకుల్. క్రిష్ దర్శకత్వంలో అడవుల్లో ఓ సినిమా షూటింగ్ పూర్తిచేసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చెక్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసింది. ఈ రెండు సినిమాల మధ్య.. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంది. ముంబయి వెళ్లి ఎన్సీబీ విచారణను ఎదుర్కొంది.

సో.. ఏ హీరోయిన్ కు అవసరం ఉన్నా లేకపోయినా.. రకుల్ మాత్రం ఇప్పుడు వెకేషన్ అత్యవసరం. అందుకే కుటుంబంతో కలిసి మాల్దీవులకు వచ్చేసింది ఈ బ్యూటీ. 

బిగ్ బాస్ ఓటింగ్ అంతా ఫేక్ అని తెలుసు