పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే ప్రశ్నించడం మాత్రమే. ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాదు. పవన్ మీద సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు, అనుమానాలు కనిపిస్తుంటాయి. కానీ వీటికి సమాధానాలు దొరకవు.
ప్రతిపక్షంలో వున్నా, అధికారంలో వున్నా జగన్ నే పవన్ టార్గెట్. బాబు అధికారంలో వున్నపుడు కూడా జగన్ నే టార్గెట్ ఛేసారు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు ముద్దే?
చంద్రబాబు పాలన బాగాలేదని, అవినీతి అన్నది పవన్ నే. మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో అందరూ కలిసి జగన్ ను ఓడించి, చంద్రబాబును గద్దెనెక్కించాలి అని కోరుకుంటున్నారు?
అమరావతి మీద ఆ రోజు ఎందుకు అలా మాట్లాడారు? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
కేవలం ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చి బాగుపడిన గంటా, అవంతి, వెల్లంపల్లి, లాంటి వారినే పవన్ ఎందుకు టార్గెట్ చేస్తారు. అది కూడా కాపులనే ఎందుకు విమర్శిస్తారు.
స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి భాజపాను ఎందుకు నిలదీయరు?
చంద్రబాబు అధికారంలోకి వస్తే పవన్ ఎలా సిఎమ్ అవుతారు? తనే మద్దతు ఇచ్చి గెల్పించిన చంద్రబాబును మళ్లీ తనే గద్దె దింపి సిఎమ్ అయ్యే సత్తా పవన్ కు వుందా?
తమ నాయకుడు సిఎమ్ కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటూ వుంటే, చంద్రబాబును సిఎమ్ ను చేయాలని పవన్ కోరుకోవడం ఏమిటి?
2019లో జనసేన స్టామినా తక్కువ వున్నపుడే ఒంటరి పోరు చేసారు. మరి పవన్ లెక్కల ప్రకారం జనసేనకు 27శాతం ఓటు బ్యాంక్ వుంది. మరి ఇప్పుడు ఒంటరి పోరు ఎందుకు వద్దు అనుకుంటున్నారు.
ఒకప్పుడు పాచిపోయిన లడ్లు ఇచ్చారు అని విమర్శించిన భాజపా ఇప్పడు ఎలా మంచిది అయింది?
ఇలా అనేక ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంటాయి. కానీ సమాధానాలే వుండవు.