పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పాపం కాళ్లలో చక్రాలు వున్నాయి. హైదరాబాద్ లో వుంటున్నారు ఆయన. కానీ పార్టీ పనులు, సమావేశాల కోసం ఆంధ్రకు వెళ్లి వస్తుండాలి.
ఆ పని అలా వుంటే కుటుంబం ఆలనా పాలనా చూసుకోవడానికి రష్యా, సింగపూర్ వెళ్లి వస్తుండాలి. ఎందుకంటే ఆయన సతీమణి, ఆమె పిల్లలు విదేశాల్లో వుంటున్నారు.
పిల్లలు సింగపూర్ లో చదువుతున్నారని బోగట్టా. అది నిజమో కాదో తెలియాల్సి వుంది. అందువల్ల కరోనా ముందు ఇక్కడి నుంచి వెళ్లిన పవన్ సతీమణి ఇక అక్కడే వుండిపోయారు.
ఆమె రష్యా..సింగపూర్ ల మధ్య గడపాల్సి వస్తోందని తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఇండియా-రష్యాల మధ్య తిరగాల్సి వస్తోంది.
డిసెంబర్ లో ఓసారి వెళ్లి వచ్చారు. మళ్లీ ఈ నెల 16న వెళ్లి నిన్నటికి నిన్ననే తిరిగి వచ్చారు. పవన్ పెద్ద పిల్లలు ఆకీరా, ఆద్యా హైదరాబాద్ లో పవన్ తోనే వుంటున్నారు. చిన్నపిల్లలు ఇద్దరు, ఆ భార్య రష్యా, సింగపూర్ ల్లో వుంటున్నారని టాక్ వుంది.