ఎవ్వర్నీ సంతృప్తి పరచలేకపోతున్న పవన్

జనసేనాని రాజకీయం రానురాను తీసికట్టుగా తయారవుతోంది. ఇటు పూర్తిస్థాయిలో రాజకీయాలు చేయలేక, అటు సినిమాలకు టైమ్ కేటాయించలేక అందర్నీ నిరాశపరుస్తున్నారు పవన్ కల్యాణ్. Advertisement జస్ట్ 2 వారాలు టైమ్ కేటాయిస్తే సరిపోతుందనుకున్న టైమ్…

జనసేనాని రాజకీయం రానురాను తీసికట్టుగా తయారవుతోంది. ఇటు పూర్తిస్థాయిలో రాజకీయాలు చేయలేక, అటు సినిమాలకు టైమ్ కేటాయించలేక అందర్నీ నిరాశపరుస్తున్నారు పవన్ కల్యాణ్.

జస్ట్ 2 వారాలు టైమ్ కేటాయిస్తే సరిపోతుందనుకున్న టైమ్ లో వకీల్ సాబ్ ను పక్కనపెట్టారు.. వెంటనే రంగంలోకి దిగాల్సిన పొలిటికల్ టైమ్ లో సినిమాలు చేస్తూ కూర్చున్నారు. ఇలా టైమింగ్ కుదరక, టైమ్ సెట్ చేసుకోలేక, తను ఇబ్బంది పడుతూ తన చుట్టుపక్కల వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు పవన్ కల్యాణ్.

ఇవాళ్టి నుంచి పవన్ పర్యటనలు మొదలుపెట్టారు. గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడ్నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాలనేది ఆయన ప్లాన్. రూట్ మ్యాప్ అంతా రెడీ చేసుకున్నారు. 

అయితే నివర్ తుపానుకు సంబంధించి అంతా ముగిసిన తర్వాత పవన్ పర్యటన చేపట్టడం ఏంటని జనసైనికులే విసుక్కుంటున్నారు. ఇదే పర్యటన ఓ 4 రోజుల కింద చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, జనసేనకు పొలిటికల్ గా కలిసొచ్చేదని చెబుతున్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు కీలక నేతలంతా పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ఎంత రాజకీయం చేయాలో అంతా చేసింది. అసెంబ్లీలో కూడా రచ్చ చేయడానికి చూసింది. మరోవైపు ప్రభుత్వం కూడా తన విధానాన్ని అసెంబ్లీ వేదికగా స్పష్టంగా ప్రకటించింది. రైతులను ఎలా ఆదుకోబోతున్నారు, ధాన్యం కొనుగోలు, బీమా లాంటి అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చింది.

ఇలాంటి టైమ్ లో పవన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? కేవలం ఇదొక కంటితుడుపు చర్యగా మాత్రమే చూస్తున్నారు జనసైనికులు. మేం కూడా ఉన్నాం  అని చెప్పుకోవడం కోసమే జనసేనాని ఈ పర్యటన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే దీని వల్ల పవన్ తో సినిమా చేస్తున్న మేకర్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు.

లెక్కప్రకారం ఈపాటికి వకీల్ సాబ్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలి. కానీ మధ్యలో గ్రేటర్ ఎన్నికల కోసం కమిటీలు, బీజేపీతో చర్చలు, ఢిల్లీ పర్యటనలు అంటూ సాగతీశారు పవన్. ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంటూ మరోసారి షూటింగ్స్ కు ఫుల్ స్టాప్స్ పెట్టేశారు. ఆ తర్వాత తన అన్న కూతురు నిహారిక పెళ్లికి వెళ్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు.

వకీల్ సాబ్ లేట్ అవుతోంది కాబట్టి, క్రిష్ దర్శకత్వంలో పవన్ చేయాల్సిన సినిమా కూడా లేట్ అవుతుంది. మధ్యలో సితార బ్యానర్ పై చేయాల్సిన సినిమా, హరీష్ శంకర్-మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు ఉండనే ఉన్నాయి.

ఇటు సినిమాలు, అటు రాజకీయ కార్యక్రమాలతో పవన్ తీరిక లేకుండా గడుపుతున్న మాట నిజమే. కానీ ఏ సమయంలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలో పవన్ పూర్తిగా విఫలమౌతున్నారు. 

పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాల్సిన టైమ్ లో సినిమాలు చేస్తూ కూర్చుంటున్నారు. సినిమాలు చేయాల్సిన టైమ్ లో రాజకీయ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. దీని వల్ల ఇటు సినీ జనాల్ని, అటు జన సైనికుల్ని ఇద్దర్నీ మెప్పించలేకపోతున్నారు పవన్.

పేపర్లు విసిరేసిన తమ్మినేని