ఫలించని ‘కాపుసేన’ ఎత్తుగడ

పవన్ కళ్యాణ్ కు దగ్గర కావాలని, ఆయన అభిమానాన్ని చూరగొనాలని వయసు మీద పడినా రాజకీయం మీద మమకారం పోని సీనియన్ కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య ఆలోచన వికటించింది. సినిమా జనాలను పోగేసి,…

పవన్ కళ్యాణ్ కు దగ్గర కావాలని, ఆయన అభిమానాన్ని చూరగొనాలని వయసు మీద పడినా రాజకీయం మీద మమకారం పోని సీనియన్ కాపు నాయకుడు చేగొండి హరిరామజోగయ్య ఆలోచన వికటించింది. సినిమా జనాలను పోగేసి, కాపుసేన అంటే బ్యానర్ కింద పవన్ బర్త్ డే హడవుడి చేసి, ఆయన మనసు చూరగొనాలని అనుకున్నారు. 

హరిరామజోగయ్య రాజకీయ ప్రస్తానం ఎక్కేపార్టీ దిగేపార్టీ అన్నట్లుగా చాలా అంచెలుగా సాగింది. ప్రస్తుతం స్తబ్దుగా వున్నారు. జనసేన లోకి దూకేస్తారని గత కోంత కాలంగా వార్తలు అయితే ప్రచారంలో వున్నాయి. ఎనభై ఏళ్లు దాటిన తరువాత ఇంకా రాజకీయాల్లో ఈ దూకుడు ఎక్కడ సాధ్యం అని అనుకున్నవారూ వున్నారు. 

కానీ ఈలోగా హరిరామజోగయ్య నేరుగా పవన్ కు దగ్గర కావడానికి మాంచి సమయం ఎంచుకున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా కాస్త హల్ చల్ చేయాలనుకున్నారు. కానీ పాలకొల్లులోనో, నరసాపురంలోనో చేస్తే పవన్ దగ్గరకు రీచ్ కాదు కదా. అందుకే హైదరాబాద్ లో చేయాలనుకున్నారు. 

కానీ హడావుడి అంటే ఎలా అందుకే సినిమా రంగంలోని కాపులను పోగేయాలనుకున్నారు. ఆ బాధ్యత ను సినిమా రంగంలోని ఓ వ్యక్తికి అప్పగించారు. పోక పోక ఆ వ్యక్తికే అప్పగించడంతోనే సగం అభాసు కు శ్రీకారం చుట్టినట్లు అయింది. చెప్పా పెట్టకుండా మారుతి లాంటి పెద్ద పేర్లు వేసేసారు. 

కులం ఏదయినా సినిమా రంగంలో అందరితో భుజం కలిపి ప్రశాంతంగా సాగిపోతున్నారు చాలా మంది కాపు ప్రముఖులు. ఇప్పుడు వీరంతా హరిరామజోగయ్య కోసం ఎందుకు వస్తారు.

పైగా పవన్ నే తనకు కాపు ట్యాగ్ లేకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే మారుతి కూడా స్కిప్ కొట్టారు. పాలకొల్లు బంధాలతో బన్నీ వాస్ లాంటి వాళ్లకు తప్పదు. మొత్తం మీద ఖర్చు అయింది తప్ప ఫలితం దక్కలేదు హరిరామజోగయ్యకు. 

పైగా ఆయనకు తెలియంది ఏమిటంటే, ఇలాంటి వ్యవహారాలు పవన్ కు అస్సలు కిట్టవు అని. అది తెలియక ఎవరో చెప్పిన ఐడియా విని, ఎవర్నో నమ్మి, డబ్బులు కాల్చుకున్నారు పాపం.