కెమెరా హైదరాబాద్ లో.. పవన్ ఢిల్లీలో

సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ ద్వితీయ విఘ్నం అంటే మరీ భయపడుతుంటారు. ఫస్ట్ సినిమా హిట్ కొట్టి.. రెండో సినిమాకి వణికిపోయిన దర్శకులెంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడిలాంటి వణుకే.. పింక్ రీమేక్ చిత్ర బృందానికి…

సినిమావాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. అందులోనూ ద్వితీయ విఘ్నం అంటే మరీ భయపడుతుంటారు. ఫస్ట్ సినిమా హిట్ కొట్టి.. రెండో సినిమాకి వణికిపోయిన దర్శకులెంతోమంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడిలాంటి వణుకే.. పింక్ రీమేక్ చిత్ర బృందానికి పట్టుకుంది. తొలిరోజు సెట్ లో పవన్ కల్యాణ్ చేసిన హడావిడి చూసి అందరూ తెగ సంబరపడ్డారు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కట్ చేస్తే రెండోరోజు షూటింగ్ కి రావాల్సిన పవన్ మంగళగిరిలో లాక్ అయిపోయారు. దీంతో సినిమా షూటింగ్ కి ద్వితీయ విఘ్నం తగిలింది. 

కాల్షీట్ ఇచ్చినా కూడా రాజకీయ పరిస్థితుల కారణంగా పవన్ కదల్లేని పరిస్థితి. మూడోరోజు ఢిల్లీలో, నాలుగో రోజు కూడా హస్తినలో కంటిన్యూ కావాల్సిన అపాయింట్ మెంట్లున్నాయి. ఇలా ఫస్ట్ డే షూట్ హైదరాబాద్ లో చేసిన పవన్ అనుకోకుండా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. అక్కడ సెట్టింగ్ లు వేసుకుని, ఆయన కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు-నిర్మాత తలలు పట్టుకుని కూర్చున్నారు.  

సినిమా షూటింగ్ కి ఓకే చెప్పిన పవన్ కల్యాణ్ ఒక వ్యూహం ప్రకారమే బీజేపీతో జతకట్టారని, పార్టీ భారం దించుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో.. పవన్ కి ఇంకా రాజకీయ మోజు పూర్తిగా తీరలేదు. రాజకీయ పర్యటనలకు నో చెప్పలేకే.. పవన్ సినిమావాళ్లకి రాలేనని సర్ది చెప్పుకుంటున్నారు. పవర్ స్టార్ తో ఒక్క సినిమా అయినా తీయాలనే కసితో ఉన్నాడు కాబట్టే దిల్ రాజు ఓర్పుతో ఉన్నాడు కానీ లేకపోతే ఇలాంటి డ్రై సబ్జెక్ట్ కోసం, పవన్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ, ఇప్పటి వరకూ షూటింగ్ వాయిదా వేసుకుని, ఇప్పుడిలా క్యాన్సిల్ చేసుకోరు. 

పవన్ రెండోరోజు షూటింగ్ క్యాన్సిల్ అనేసరికి సెంటిమెంట్ ప్రకారం దిల్ రాజు కాస్త ఇబ్బంది పడ్డారట. మూడోరోజూ, నాలుగో రోజు కూడా క్యాన్సిల్ అయ్యే సరికి ఆ బాధ మరీ ఎక్కువవుతోందట. సరిలేరు సక్సెస్ మీట్ కోసం బైటకు వచ్చిన దిల్ రాజుని ఒకరిద్దరు సన్నిహితులు పవన్ సినిమా గురించి అడిగే సరికి ఇబ్బంది పడ్డారు. రెండో రోజే షూటింగ్ కి డుమ్మా కొట్టిన పవన్, రీఎంట్రీలో.. రీఎంట్రీ ఎప్పుడిస్తారో చూడాలి.

రాజ్ డిస్కో రాజ్

కూల్చెయ్య‌డానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు

కోత్త సీన్లు యాడ్ చేస్తూన్నాం