పవన్ ఇగో హర్ట్.. జగన్ మీద తీవ్ర అక్కసు!

వెకిలి మాటలు.. పెడార్థాలు.. విసుగు పుట్టించే హావభావాలు.. బుర్రా పాడు లేని లేకి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాని మాటలు.. ఏతావాతా ఇదీ పవన్ కల్యాణ్ తీరు. కనీసం ఎమ్మెల్యేగా…

వెకిలి మాటలు.. పెడార్థాలు.. విసుగు పుట్టించే హావభావాలు.. బుర్రా పాడు లేని లేకి ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాని మాటలు.. ఏతావాతా ఇదీ పవన్ కల్యాణ్ తీరు. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయినా, రెండు చోట్ల పోటీ చేసి చిత్తుగా ఓడినా.. పవన్ కల్యాణ్ తీరులో మాత్రం ఏ మార్పూ కనిపించలేదు. పైపెచ్చూ మరింత తీసికట్టుగా కనిపిస్తోంది తీరు.

బహుశా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అయినట్టుగా ఉంది. అందుకే అయిన కాడికి మాట్లాడుతూ ఉన్నాట్టున్నారు జనసేన అధినేత. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సాధించిన విజయాన్ని కేవలం ఈవీఎంల మహిమగా తేల్చారాయన. ప్రజాతీర్పును అలా ఈవీఎంలకు అంటగట్టేయడంతోనే పవన్ కల్యాణ్ తీరు  ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా .. తను ఏం మాట్లాడినా వచ్చేదీ లేదూ, పోయేదీ లేదు… అన్నట్టుగా ఉంది పవన్ కల్యాణ్ తీరు. అయితే జనసేన అధిపతి ఒకటి మాత్రం గట్టిగా చాటుకుంటూ ఉన్నాడు. అదేమిటంటే జగన్ మీద అక్కసు. వైఎస్ జగన్ మీద పవన్ కల్యాణ్ లో అపరిమితమైన అక్కసు ఉందని మాత్రం స్పష్టం అవుతోంది.

వెనుకటికి కూడా పవన్ కల్యాణ్ ఇలానే మాట్లాడాడు. 'జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా..' అని వీరావేశంతో, వెకిలిగా ఊగిపోయిన మనిషి కూడా ఇతడే. అదెలా జరిగిందో పవన్ కల్యాణ్ కు ఈ పాటికే అర్థం అయి ఉంటుంది.  అందుకే తీవ్రంగా ఇగో హర్ట్ అయ్యింది. అక్కసు అనే విషాన్ని ఇలా కక్కుతున్నారాయన.

'ఏమైనా జరగొచ్చు.. బొత్స ముఖ్యమంత్రి కావొచ్చు.. మళ్లీ ఎన్నికలు రావొచ్చు..' అంటూ పవన్ కల్యాణ్ ప్రేలాపించారు. ఈ ప్రేలాపనలు 'జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతాడో చూస్తా..' అనే డైలాగ్ లానే ఉన్నాయి. హర్ట్ అయిన తన ఇగోని చల్లార్చుకోవడానికి పవన్ ఈ తరహాలో వ్యవహరిస్తున్నారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.