ఇల్లెందులో ‘దృశ్యం’.. కానీ బయటపడిందిలా!

దృశ్యం సినిమాలో తన కుటుంబాన్ని వేధిస్తున్న కుర్రాడ్ని వెంకటేష్ హతమారుస్తాడు. ఎవరికీ కనిపించని చోట పాతిపెడతాడు. ఎన్నేళ్లయినా ఆ కేసును పోలీసులు చేధించలేకపోతారు. సరిగ్గా అలాంటిదే 2 ఏళ్ల కిందట ఖమ్మం జిల్లా ఇల్లెందులో…

దృశ్యం సినిమాలో తన కుటుంబాన్ని వేధిస్తున్న కుర్రాడ్ని వెంకటేష్ హతమారుస్తాడు. ఎవరికీ కనిపించని చోట పాతిపెడతాడు. ఎన్నేళ్లయినా ఆ కేసును పోలీసులు చేధించలేకపోతారు. సరిగ్గా అలాంటిదే 2 ఏళ్ల కిందట ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగింది. కానీ ఈ కేసును మాత్రం పోలీసులు చేధించారు.

2018 నాటి ఘటన.. విజయ్ కుమార్ జులాయిగా తిరిగేవాడు. ఎప్పుడూ గొడవలు, పోలీసు కేసులే. ఇల్లెందుకు చెందిన మరో ముఠాతో ఇతడికి ఎప్పుడూ గొడవలే. ఓరోజు విజయ్ కుమార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్ద ఒంటరిగా దొరికాడు. అదను కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన కమ్ము, కమల్, పాసిలు  విజయ్ కుమార్ పై దాడిచేశారు. అతడ్ని హతమార్చారు. చీకట్లో శవాన్ని దగ్గర్లోని శ్మశాన వాటికలో పాతిపెట్టారు.

ఈ కేసు రెండేళ్లుగా మిస్టరీగా మారింది. విజయ్ కుమార్ ఆచూకీ దొరకలేదు. ఒక్క ఆధారం కూడా పోలీసులకు దక్కలేదు.

కట్ చేస్తే.. తాజాగా ఇల్లెందులోని ఓ ఎంపీటీసీ సభ్యుడిపై హత్యాయత్నం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. వాళ్లను విచారిస్తున్న క్రమంలో ఓ అనుమానితుడు విజయ్ కుమార్ హత్య వివరాల్ని బయటపెట్టాడు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. కమ్ము, కమల్, పాసిలను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వాళ్లు చెప్పిన ఆధారాల ఆధారంగా తవ్విచూడగా.. విజయ్ కుమార్ అస్తికలు, ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆనవాళ్లు ఆధారంగా అది విజయ్ కుమారేనని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. అలా 2018లో జరిగిన మర్డర్ ను అనుకోకుండా 2021లో సాల్వ్ చేశారు పోలీసులు.

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్

జోగి బ్రదర్స్… జాతి రత్నాలు రివ్యూ