పోలీసులు ఫ్రస్టేట్ అవుతున్నారా?

చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అందులోనూ పోలీసులకు మరీ వేగంగా వస్తుంది. లాక్ డౌన్..లాక్ డౌన్ అన్నా కూడా ఒకటి రెండు శాతం మంది జనం మాట వినడం లేదు. రోడ్ల…

చెప్పిన మాట వినకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. అందులోనూ పోలీసులకు మరీ వేగంగా వస్తుంది. లాక్ డౌన్..లాక్ డౌన్ అన్నా కూడా ఒకటి రెండు శాతం మంది జనం మాట వినడం లేదు. రోడ్ల మీదకు వస్తున్నారు. వీరిలో మరి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినవారే వున్నారో, ఇవ్వని వారే వున్నారో అన్నది వేరే సంగతి.  ముందుగా లాఠీ దెబ్బలు అయితే గట్టిగా తినేస్తున్నారు. 

ఎక్కడెక్కడ పోలీసులు ఎలా లాఠీలు గట్టిగా వాడుతున్నారో ఆ విడియోలు వాట్సాప్ లో బాగా చలమాణీ అవుతున్నాయి. ఇళ్లపట్టున వున్నవారు, ఇలాగే కావాలి. ఎవరు వెళ్లమన్నారు బయటకు అని కామెంట్ చేస్తున్నారు. కానీ పోలీసుల చర్యల వల్ల పాలు, నిత్యావసర వస్తువులు డెలివరీ చేయడానికి వీలు కావడం లేదని, వృధాగా పోతున్నాయనే విమర్శలు మెల్లగా వినిపించడం ప్రారంభమైంది. 

ఈ మేరకు ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనం కూడా అందించిది. 15వేల లీటర్ల పాలు, 10వేల కిలోల కూరగాయలు వృధా అయిపోయాయి అంటూ ఈకామర్స్ ఏజెంట్లుచెప్పిన విషయాన్ని ఆ కథనంలో ప్రస్తావించింది.

ఇదిలా వుంటే కరోనా భయం, పై నుంచి ఆదేశాలు, విరామం లేని డ్యూటీలు ఇవన్నీ కలిసి పోలీసులను ఫ్రస్టేట్ చేస్తున్నాయని, వారు అదంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చినవారిపై చూపిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.  అది ఎంతవరకు నిజమో కాదో కానీ, విడియోల్లో పోలీసులు కొడతున్న తీరు, కనీసం ఎందుకు వచ్చారని అడకుండా కూడా వాయించేస్తున్న వైనం చూస్తుంటే, జనాలు మాట వినకుండా రోడ్ల మీదకు వస్తున్నారని పోలీసులు కాస్త అసహనానికి గురవుతున్నారు అనిపిస్తోంది. 

మొత్తం మీద దేశం మొత్తం 21 రోజుల నిరవిధిక కర్ఫ్యూ విధించి గట్టిగా ఒకటి రెండు రోజులు కాకుండానే పదుల సంఖ్యలో లాఠీ విన్యాసాల విడియోలు వాట్సాప్ లోకి వచ్చేసాయి. సన్నాయి నొక్కలు కూడా ప్రారంభమయ్యాయి. మరో రెండు రోజులు గడిస్తే పరిస్థితి ఎలా వుంటుందో?

స్కూటర్ మీద రౌండేసిన తణుకు ఎమ్మెల్యే