పోర్న్ వీక్షిస్తున్నారా.. ఇక బీ కేర్ ఫుల్!

మనం నోరు తెరిస్తే విలువల గురించే మాట్లాడతాం. హిందుత్వ విలువలు, నైతిక విలువల గురించి మనం దట్టంగా మాట్లాడగలం. మన పురాణాలు, మన నీతులు, మన చరిత్ర, మన విలువలు.. ఘనమైనవని చెప్పుకుంటాం. ప్రపంచంలోనే…

మనం నోరు తెరిస్తే విలువల గురించే మాట్లాడతాం. హిందుత్వ విలువలు, నైతిక విలువల గురించి మనం దట్టంగా మాట్లాడగలం. మన పురాణాలు, మన నీతులు, మన చరిత్ర, మన విలువలు.. ఘనమైనవని చెప్పుకుంటాం. ప్రపంచంలోనే మనది గొప్ప సంస్కృతి అని డబ్బా కొట్టుకుంటాం. 

ఇక కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు, మత రాజకీయాలు చేసే వాళ్లు చెప్పే విలువలకు అయితే ఒక హద్దే లేదు. అయితే ఇదే దేశంలో అమ్మాయిలపై అనునిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి, నీతులు చెప్పే రాజకీయ నేతలు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు.. నేతలు, రేపిస్టులే కాదు.. సామాన్యుల్లోనూ నైతికత ఎంతమాత్రమో అందరికీ తెలిసిందే.

అందుకు ఒక నిదర్శనం పోర్న్ చూడటం. నిస్సందేహంగా పోర్న్ వీక్షణ అనైతికమే. అయినా అనునిత్యం విలువల గురించి మాట్లాడే మనదేశంలో పోర్న్ వీక్షణ ప్రపంచంలోనే టాప్ ఉంటుంది.  పోర్న్ వెబ్ సైట్లకు భారతీయులు ప్రధాన ఆధారం. మన వాళ్లు వాళ్ల సంస్కృతి చెడ్డది అని చెప్పే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. ఇండియాలో పోర్న్ వీక్షణ సరిసమానంగా ఉంది! పోర్న్ వల్ల చాలా విపరీతాలు జరుగుతాయి. అందులోనూ సందేహం లేదు.

అందుకే కొన్నేళ్లుగా సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో పోర్న్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. అయినా పోర్న్ ఏదో ఒక రూపంలో నెట్టింట తిష్ట వేసే ఉంది. అలా పోర్న్ ను వీక్షించే వారికి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఝలక్ ఇస్తోంది. అతిగా పోర్న్ వీక్షించే వాళ్ల జాబితాను, అందులోనూ చిన్న పిల్లల, హింసాత్మక పోర్న్ వీక్షించే వారిని ఐడెంటిఫై చేసే పని మొదలైనట్టుగా తెలుస్తోంది. మీరు ఎంత రహస్యంగా పోర్న్ వీక్షించినా.. పోర్న్ సైట్లకు ఏ ఐపీల నుంచి వ్యూస్ లభిస్తున్నాయో సైబర్ క్రైమ్ పోలీసులు కనిపెట్టగలరు.

ఇప్పటికే తమిళనాట ఒక జాబితా రెడీ అయ్యిందట. దాదాపు మూడు వేల మందిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారని సమాచారం. చాలా మంది మర్యాదస్తులే పోర్న్ వీక్షకులు. రేపు మీరు పోర్న్ చూస్తున్నారని తేలింది, వచ్చి కౌన్సిలింగ్ కు హాజరవ్వండని పోలీసుల నుంచి ఫోన్ వస్తే..తల ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి పోర్న్ వీక్షించే వాళ్లు బీ కేర్ ఫుల్!