Advertisement

Advertisement


Home > Politics - Political News

అనసూయ కోసం ఆ నలుగురు

అనసూయ కోసం ఆ నలుగురు

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బుల్లితెరపై అనసూయ విశ్వరూపం చూపిస్తోంది. సుమని పూర్తిగా డామినేట్ చేస్తూ.. అన్ని ఛానెళ్లలో రియాల్టీ షోలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ ఒకే ఛానెల్ కు స్టిక్ అయి ఉన్న అనసూయ.. ఇప్పుడు అన్ని ఛానెళ్లనూ ఏలేస్తోంది. తెలుగు భాషపై పట్టు, అందాల విందుకి మొహమాటం లేకపోవడంతో ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా నడుస్తోంది. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉందంటారు. కానీ అనసూయ విజయం వెనక నలుగురు మగాళ్లు ఉన్నారు.

అనసూయ చేసే రియాల్టీ షోలకు హైపర్ ఆది పెద్ద ప్లస్ పాయింట్. ఆమె చేసే రియాల్టీ షోలకు ప్రోమోలు కూడా ఆది డిజైన్ చేస్తుంటాడు. జబర్దస్త్ లో మొదలైన ఫ్రెండ్ షిప్ కోసం ఆది, అనసూయ కెరీర్ కి బాగానే హెల్ప్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. జబర్దస్త్ లో వచ్చే స్కిట్ లలో కూడా అనసూయతో డ్యూయెట్లు పాడుతూ ఆమెకు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెడుతున్నాడు.

ఇక డ్యాన్స్ మాస్టర్లు శేఖర్, జానీ కూడా అనసూయతో డ్యూయెట్లంటే పిచ్చెక్కిపోతారు. ఈమధ్య జబర్దస్త్ లో కామెడీతో పాటు, డ్యాన్స్ లు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. రష్మిని పక్కనపెట్టి మరీ అనసూయతో చిందులేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఈ ఇద్దరు డ్యాన్స్ మాస్టర్లు. ఇప్పుడు ప్రదీప్ కూడా వీరితో జత కలిశాడు. రీసెంట్ గా ఓ ప్రోగ్రామ్ ప్రోమోలో.. అనసూయ-ప్రదీప్ డ్యూయట్లు హైలెట్ గా కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద అనసూయకి ఈ నలుగురు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారన్నమాట.

దాదాపు అన్ని ఛానెళ్లలో కనిపించే షోలలో వీరిదే డామినేషన్ కాబట్టి, అనసూయ కూడా వీరితో కలసి క్రేజీ కాంబినేషన్ గా మారిపోయింది. కెరీర్ బాగా ఊపందుకుంటున్న ఈ దశలో అనసూయ కూడా మరింత గ్లామర్ గా తయారై ఫొటోషూట్ లతో పిచ్చెక్కిస్తోంది.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?