Advertisement

Advertisement


Home > Politics - Political News

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

అతివేగం ముగ్గురు కుర్రాళ్ల ప్రాణాలు తీసింది. రోడ్డు ఖాళీగా ఉందని, ముందువెనక చూడకుండా వేగం పెంచి ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ కు చెందిన యువకులు. కర్మన్ ఘాట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గుర్రంగూడలో జరిగిన ఓ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్లారు మల్లికార్జున్, సాయిరామ్, సాయినాధ్. అంతా బాగా చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ విచక్షణ మరిచి అతివేగంతో కారును డ్రైవ్ చేయడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సాయిరామ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాగా, సాయినాథ్ ఫిలిప్స్ లో మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాడు.

సాయినాథ్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న అతడి సహోద్యోగి కల్యాణ్ మాత్రం స్వల్ప గాయాలతో ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనికి కారణం అతడు సీట్ బెల్ట్ పెట్టుకోవడమే. మిగిలిన వారంతో సీట్ బెల్ట్ లేకుండానే ప్రయాణం చేశారు.

అతివేగం వల్ల కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, వీరు ఎంత వేగంతో కారు నడిపారనే విషయం అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వల్ప గాయాలతో బయటపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కల్యాణ్ ను అడిగి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?