cloudfront

Advertisement


Home > Politics - Political News

అచ్చెన్నా.. ఈ ఆవేదన అప్పుడేమయ్యిందన్నా.!

అచ్చెన్నా.. ఈ ఆవేదన అప్పుడేమయ్యిందన్నా.!

అసెంబ్లీలో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి మీద సెటైర్లు చాలా గట్టిగా పడిపోతున్నాయి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సహా, వైసీపీ శాసనసభ్యులంతా అచ్చెన్నాయుడిని ఓ రేంజ్‌లో ర్యాగింగ్‌ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడి హైటూ, వెయిటూ.. భలేగా కామెడీ అయిపోతున్నాయి. అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు.. ఇదంతా 'బాడీ షేమింగ్‌' తరహా వ్యవహారమే కావొచ్చుగాక. 

కానీ, గతంలో అచ్చెన్నాయుడు చేసిందేంటి.? మహిళ అని కూడా చూడకుండా అప్పట్లో అచ్చెన్నాయుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించారు. వైసీపీకి చెందిన చాలామంది నేతలపై అచ్చెన్నాయుడు ఉపయోగించిన జుగుప్సాకరమైన పదజాలం అంత తేలిగ్గా మర్చిపోగలమా.? రాజకీయాల్లో 'టిట్‌ ఫర్‌ టాట్‌' తప్పదంతే.! 

తనకు ఆనాడు జరిగిన అవమానంపై రోజా ప్రస్తావిస్తూ, ''ఇప్పుడు అచ్చెన్నాయుడికి 'అవమానం' గుర్తుకొచ్చిందా.? ఆయన ఆవేదనతో రగిలిపోతున్నారా.? అప్పుడు నా మీద ఆయన చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల మాటేమిటి.?'' అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని సైతం ఒకటికి వందసార్లు 'దొంగ.. దొంగ..' అంటూ అచ్చెన్నాయుడు సహా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో ఇప్పటికీ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తూనే వున్నాయి. 

ఒక జన్మలో చేసిన పాపాలకు, ఇంకో జన్మలో ప్రాయిశ్చిత్తం.. అనేది వెనకటి మాట. ఇప్పుడలా కాదు, నిన్న చేసిన పాపానికి.. నేడు శిక్ష పడిపోతుందంతే.!