Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇది నా దారుణ అనుభవం

ఇది నా దారుణ అనుభవం

కరోనా కల్లోలం అల్లకల్లోలం సృష్టిస్తోంది. నేను కూకట్ పల్లిలో వుంటాను. ఇటీవల ర్యాపిడ్ టెస్ట్ చేయిస్తే నాకు నెగిటివ్ వచ్చింది. నా భార్యకు పాజిటివ్ వచ్చింది. అయితే ఏ లక్షణాలు లేవు. కానీ చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతతో డాక్టర్ ను సంప్రదించి, కోవిడ్ ప్రొటోకాల్ పరిక్షలు అన్న చేయించాను. 

ఇవన్నీ కూకట్ పల్లి మెయిన్ రోడ్ మీద వున్న ఓ పెద్ద ఆసుపత్రిలో చేయించాను. హైదరాబాద్ లో, ఆంధ్రలో బ్రాంచ్ లు వున్న ఆసుపత్రి కావడంతో నమ్మకంతో అక్కడ పరిక్షలు చేయించడం నాకు అలవాటు. రిపోర్టులు అన్నీ నార్మల్ గా వున్నాయి. మళ్లీ అయిదారు రోజులు ఆగి మళ్లీ అన్ని పరిక్షలు చేయించాను. రెండు సార్లకు కలిపి దాదాపు ఇద్దరికీ నలభై వేల పైన ఖర్చయింది. 

రెండోసారి చేసినపుడు షాకింగ్...సీరమ్ రియాక్టివ్ ప్రోటీన్ అనే పరిక్ష ఫలితం ఏకంగా 34, 39 కింద వచ్చింది మా ఇద్దరికి. మతి పోయింది. కాళ్లు చేతులు ఆడలేదు. నాకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ కు ఫోన్ చేసాను. 

అర్జంట్ గా స్టెరాయిడ్ పెట్టాలన్నారు. కానీ మేం ఇద్దరం డయాబెటిక్ పేషెంట్లం. స్టెరాయిడ్ పెడితే గ్లూకోజ్ పెరిగిపోతుంది. దానికి డాక్టర్ల పర్యవేక్షణ కావాలి. అలా జరగాలి అంటే ఆసుపత్రిలో చేరాలి. ఎక్కడా బెడ్ లు లేవు. ఏం చేయాలో పాలు పోని పరిస్థితి.

అలాంటి టైమ్ లో మమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్జర్ కు అనుమానం కలిగింది. మీ ఇద్దరికీ ఏ సింప్టమ్స్ లేవు. పైగా రెండు సార్లు నెగిటివ్ వచ్చింది. రిపోర్టు తప్పేమో ఎందుకయినా మరో చోట చేయించండి అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ , కొండాపూర్ ల్లో బ్రాంచీలు వున్న ఓ ప్రముఖ ల్యాబ్ కు వెళ్లి మళ్లీ వేల రూపాయల కట్టి పరిక్షలు చేయించాం.

మళ్లీ షాకింగ్. ఫలితాలు అన్నీ నార్మల్. వెంటనే మొదట చేయించిన ఆసుపత్రిని సంప్రదించి నిలదీసాం. మళ్లీ చేస్తాం అని చేసారు. మరోసారి షాక్. ఫలితాలు నార్మల్. అంటే మొదట చేసినవి తప్పు అని తేలింది.

ఇది ఒక ప్రముఖ ఆసుపత్రి నిర్వాకం. ఆ పరిక్షతో ఆగిపోయి స్టిరాయిడ్స్ వాడేసి వుంటే.. ఆ పరిక్షతో ఆగిపోయే దానికి తగినట్లు ముందుకు వెళ్లిపోయి వుంటే... 

ఎంత మంది మళ్లీ మళ్లీ వేలకు వేలు ఖర్చు చేసి పరిక్షలు చేయించుకోగలరు. ఆసుపత్రులు, ల్యాబ్ ల నిర్వహకులు ఆలోచించాలి. డబ్బు, వ్యాపారమే ప్రధానం కాదు. ఇది ప్రాణాలతో చెలగాట. మానసిక వేదన. ఒకటి కాదు. 

నాకు జరిగినట్లు మరి ఎవరికి జరగకూడదని కోరుకుంటూ.. ఆసుప్రతి పేరు చెప్పకపోవడం ఎందుకుంటే దాన్ని బదనామ్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఇది చదవి వాళ్లు జాగ్రత్త పడాలి. జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అందుకే ఇదంతా.

కూకట్ పల్లి నివాసి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?