Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీ ప్ర‌భుత్వ అఫిడ‌విట్..ఆర్ఆర్ఆర్ మేక‌పోతు గాంభీర్య‌మా!

ఏపీ ప్ర‌భుత్వ అఫిడ‌విట్..ఆర్ఆర్ఆర్ మేక‌పోతు గాంభీర్య‌మా!

ఇదేమీ గాసిప్ కాదు, ఉత్తుత్తిగా చెప్పుకునే మాట కాదు, యూట్యూబ్ చాన‌ళ్ల‌లో ప్ర‌సారం అయ్యే గ్యాస్ కాదు.. ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్. అందులో సంచ‌ల‌న అంశాల‌ను పేర్కొంది ఏపీ ప్ర‌భుత్వం.  ఆ సంచ‌ల‌న అంశాలు ర‌క‌ర‌కాల చ‌ర్చ‌కు దారి తీస్తూ ఉన్నాయి.

అందులో ముఖ్య‌మైన‌ది.. ఇన్నాళ్లూ ర‌ఘురామ‌ది వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎందుకో మొద‌లైన తీవ్ర‌మైన కోపం అనుకున్నారు. ఈ మ‌ధ్య‌నే ర‌ఘురామకృష్ణంరాజుకు స‌న్నిహితుడిగా పేరుపొందిన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇదంతా ఇగో వార్ అన్న‌ట్టుగా స్పందించారు.

దానికి ఏకంగా మ‌హాభార‌తానికి త‌నకు తోచిన వ్యాఖ్యానం చెప్పారు ఉండ‌వ‌ల్లి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ర‌ఘురామ‌ల అహంకార‌పూరిత వైఖ‌రి వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఉండ‌వ‌ల్లి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ఇరు వ‌ర్గాల‌దీ అహంకార‌మే అని సూత్రీక‌రించారు.

మ‌రి అదే అనుకుంటే.. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంలో డ‌బ్బుల గోల కూడా ఉంద‌ని అంటోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇందుకు సంబంధించి ఏకంగా సుప్రీం కోర్టుకు అఫ‌డ‌విట్ ను అందించింది. ఏ గాసిప్పుల ఆధారంగానో ప్ర‌భుత్వం అఫిడ‌విట్ ను పొందు ప‌రిచే అవ‌కాశం ఉండ‌దు.

ఇదే స‌మ‌యంలో ఆర్ఆర్ఆర్ అరెస్టు స‌మ‌యంలో ఫోన్ వ్య‌వ‌హారం కూడా చ‌ర్చ‌లో నిలిచింది. ఆ ఫోన్ పాస్ వ‌ర్డ్ కోస‌మే ర‌ఘురామ‌ను పోలీసులు కొట్టారంటూ అప్ప‌ట్లో ర‌చ్చ జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ ఫోన్ వ్య‌వ‌హారం తెర మీద‌కు వ‌స్తోంది.

ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ కు పూర్తి ఆధారం ఆ ఫోన్ అని, ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అందులోని వివ‌రాల‌ను బ‌య‌ట‌కు తీసి, ధ్రువీక‌రించున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆ వివ‌రాల‌నే ఇప్పుడు సుప్రీం కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్టుగా స్ప‌ష్టం అవుతోంది.

ప‌ది ల‌క్ష‌ల యూరోల మొత్తం టీవీ ఫైవ్ నాయుడు నుంచి ర‌ఘురామ అకౌంట్ కు బ‌దిలీ అయ్యాయ‌ని, చంద్ర‌బాబు నాయుడు- లోకేష్ లు వాట్సాప్ ద్వారా ర‌ఘురామ‌తో చాట్ చేశార‌ని.. వీళ్లంతా ఆ ప్రెస్ మీట్ వ్యూహ‌క‌ర్త‌లు అని ఏపీ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ లో పేర్కొంది. ఇలా జాయింటుగా ప్ర‌భుత్వంపై విషం చిమ్మే య‌త్నం జ‌రిగింద‌ని కోర్టుకు విన్న‌వించింది ఏపీ ప్ర‌భుత్వం. 

త‌ను యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీనేనంటూ, త‌న‌ను ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ విభాగం భేటీకి పిల‌వ‌లేదంటూ.. ఒక‌వైపు గోల పెడుతూ, మ‌రోవైపు ఆ పార్టీ పై దుమ్మెత్తి పోస్తున్నారు ఆర్ఆర్ఆర్. అయితే ఆయ‌న ఫోన్ మాత్రం వేరే గుట్టునంతా బ‌య‌ట‌పెట్టిన‌ట్టుగా ఉంది.

ఏపీ ప్ర‌భుత్వానికి ఆయ‌న ఫోనే ఇప్పుడు ఆయుధంగా మారిన‌ట్టుగా ఉంది. ఈ ప‌రిణామాల మ‌ధ్య‌న అరెస్టు త‌ర్వాత ర‌ఘురామ చూపిందంతా మేక‌పోతు  గాంభీర్య‌మే అని ప్ర‌జ‌లు అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. మ‌రి కోర్టులో ఈ వ్య‌వ‌హారం ఇంకా ఎలాంటి మ‌లుపులు తిరుగుతుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?