Advertisement

Advertisement


Home > Politics - Political News

అమరామతిలో మరోసారి బయటపడ్డ బాబు బండారం!

అమరామతిలో మరోసారి బయటపడ్డ బాబు బండారం!

సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన సచివాలయమే చిన్నపాటి వర్షాలకు కారుతూ వస్తోంది. అప్పట్లోనే దాని నాణ్యత ఏ పాటిదో బయటపడింది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయం చేసిన నిర్మాణమే అలాంటి నాణ్యతతో ఉన్నప్పుడు.. హైకోర్టు తాత్కాలిక భవనానికి వెచ్చించింది నూటా యాబై కోట్ల రూపాయలేనట. అలాంటప్పుడు దీనిస్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మితమైన తాత్కాలిక హైకోర్టు భవనం.. చిన్నపాటి వర్షానికి తన నాణ్యతను చూపించింది. హైకోర్టు భవనంలోపల భారీగా వర్షం నీరు చేరాయని తెలుస్తోంది. వివిధ చోట్ల లీకులు ఇచ్చింది భవనం. గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీరు చేరినట్టుగా తెలుస్తోంది.

ఇదీ చంద్రబాబు నాయుడి మార్కు అభివృద్ధి. నూటాయాభై కోట్ల రూపాయల ఖర్చు వెచ్చించి, ఒక చిన్నపాటి భవనాన్ని కట్టారు. అది చిన్న వర్షానికి తట్టుకోలేక పోతోంది. గోడల నుంచి నీరు లీక్ అవుతోందంటే.. దీని కథాకమామీషు ఏమిటో, దీన్ని నాటి కాంట్రాక్టర్లు ఏపాటి నాణ్యతతో కట్టారో.. వారు కమిషన్లు ఏ స్థాయిలో చెల్లించుకున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?