Advertisement

Advertisement


Home > Politics - Political News

పెద్ద గొంతు అచ్చెన్నకు పచ్చి వెలక్కాయ ?

పెద్ద గొంతు అచ్చెన్నకు పచ్చి వెలక్కాయ ?

అన్ని దారులూ మూసుకుపోతున్నాయా. అన్ని కష్టాలూ ఒక్కసారిగా వచ్చిపడుతున్నాయా. లేకపోతే ఏమిటిది హతవిధీ అనుకోవడం తమ్ముళ్ళ వంతు అవుతోంది. గత ఏడాది ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఓ వైపు ఇంకా  పచ్చి పుండై వెక్కిరిస్తూంటే మరో వైపు కుంభకోణాల పాములు బిలబిలమంటూ బిలం నుంచి బయటకు వచ్చి వాటేసుకుంటున్నాయి.

టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి వాడినని ఫీల్ అయ్యే ఉత్తరాంధ్రా టీడీపీ దిగ్గజం, కింజరపు రాజకీయ కుటుంబ వంశీకుడు, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి అయిన కింజరపు అచ్చెన్నాయుడు ఇపుడు పెద్ద చిక్కుల్లోనే పడిపోయారు. విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ శోధనలో అచ్చెన్న దాదాపు వేయి కోట్లకు పైగా ఈఎస్ ఐ స్కాంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి సంబంధించి  నాలుగేళ్ళ క్రితం టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిలో కాంటాక్ట్ ఇవ్వాలంటూ మంత్రి స్వయంగా ఈఎస్ఐ డైరెక్టర్ కు లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న ఈఎస్ఐ డైరెక్టర్ టెలి హెల్త్ సర్వీసెస్ నామినేషన్ పద్ధతిన మెడిసిన్స్ అఫ్లై కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి లేఖ తో పాటుగా నివేదిక కూడా బట్టబయలు అయింది. దీనిలో ప్రధానంగా కోట్ల రూపాయల స్కాం జరిగినట్టుగా విజిలెన్స్ బయటపెట్టింది. రేట్ కాంటాక్ట్ లో లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఈఎస్ఐ డైరెక్టర్ కాంటాక్ట్ కట్టబెట్టారని తేల్చింది.

దీని మీద అచ్చెన్న తనకేమీ సంబంధం లేదని, కేంద్రం ఆదేశాల ప్రకారమే చేశానని చెబుతున్నా ఈ పెద్ద స్కాంలో అచ్చెన్న చిక్కుకున్నారని, ఆయన్ని అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి అచ్చెన్నని  టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ చేద్దామని, జగన్ మీద ప్రయోగిద్దామని ముచ్చట పడుతున్న చంద్రబాబుకు ఈ స్కాం బయటకు రావడం అంటే ఇరకాటంలో పడినట్లే.

దీని మీద తగిన చర్యలు ఉంటాయని వైసీపీ కార్మిక  మంత్రి జయరాం ప్రకటించిన నేపధ్యంలో అచ్చెన్న భవితవ్యంపైన కూడా తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు. అసలే ఉత్తరాంధ్రాలో కుదేలైన టీడీపీకి పెద్ద దిక్కుగా, పెద్ద గొంతుకగా ఉన్న అచ్చెన్న ఇపుడు హఠాత్తుగా ఇబ్బందుల్లో పడడం అంటే సైకిల్ పార్టీకి పంక్చర్లు పడినట్లేనని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?