Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎట్టకేలకు జూమ్ నుంచి బయటకొచ్చిన బాబు

ఎట్టకేలకు జూమ్ నుంచి బయటకొచ్చిన బాబు

చాన్నాళ్ల తర్వాత చంద్రబాబు బైటకొచ్చారు. రోడ్డెక్కారు, వరి కంకులు పట్టుకుని ధర్నా చేశారు, తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. అసలు చంద్రబాబు ఇప్పుడెందుకు బైటకొచ్చారనేదే అసలు ప్రశ్న.

గిట్టుబాటు ధర సమస్య (ఒకవేళ నిజంగా ఉండి ఉంటే) అది ఇప్పటిది కాదు. నివర్ తుపాను ప్రభావం తగ్గి కూడా రోజులు గడుస్తోంది. రైతుల నష్టపరిహారంపై ఆల్రెడీ అధికారుల బృందం మదింపు మొదలు పెట్టింది. మరి హఠాత్తుగా బాబుకి రైతులపై ప్రేమ ఇప్పుడే ఎందుకు పొంగుకొచ్చింది. జూమ్ లో నుంచి రోడ్డుపైకి రావడానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నారు?

ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి. ఇన్నాళ్లూ కలుగులో ఎలుకలా బిక్కు బిక్కుమంటూ బతికిన చంద్రబాబు, హైదరాబాద్ అమరావతి షటిల్ సర్వీస్ చేస్తూ తిరిగిన బాబు.. అసెంబ్లీ సమావేశాలకు కూడా డుమ్మా కొడితే పూర్తిగా పరువు పోతుందని తెలిసి బైటకొచ్చారు.

ఒక రకంగా ప్రాణభయంతోనే ఇన్నాళ్లూ బాబు జనంలోకి రాకుండా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు బైటకొచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాంటి బాబు నిజంగా ఇప్పుడు ప్రాణాలకు తెగించి బైటకొచ్చారనే చెప్పాలి. అది కూడా ప్రజల కోసం కానే కాదు, తన ఉనికి కోసం, అసెంబ్లీలో తన హాజరు కోసం.

చంద్రబాబు గుప్పిట బిగిస్తేనే.. ఏడాదిన్నర కాలంలో నలుగురు ఎమ్మెల్యేలు చేజారారు. మరికొంతమంది జారిపోడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీకి కూడా రాకుండా డుమ్మా కొడితే.. అసలుకే మోసం వస్తుందని, ప్రతిపక్ష హోదా కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని బాబు ఆందోళన పడుతున్నారు. అందుకే హడావిడిగా జూమ్ లోనుంచి బైటకొచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

వరదలు, వర్షాలు, కరోనాతో ప్రజలు కష్టాలు పడుతుంటే బైటకు రావడానికి ధైర్యం చేయని, బాబు.. కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే అడుగు బైట పెట్టారు.

అసెంబ్లీలో చంద్రబాబు రచ్చ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?