Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆ సింగర్ కు చంద్రబాబు అభినందనల కథేంటి?

ఆ సింగర్ కు చంద్రబాబు అభినందనల కథేంటి?

సింగర్ గా స్మిత ఇరవై సంవత్సరాలను పూర్తి చేసుకుందట. ఈ ఇరవై యేళ్లలో ఆమె నుంచి వచ్చిన ఆణిముత్యాలు ఏవోతెలీదు కానీ, ఆమె ఇరవై యేళ్లను పూర్తి చేసుకుందంటూ మీడియా హడావుడి చేస్తూ ఉంది. విశేషం ఏమిటంటే.. ఆమె ఇరవై యేళ్ల కెరీర్ ను పూర్తి చేసుకోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా స్పందించేశారట!

ఆమెను అభినందించారట. అభినందిస్తూ లేఖ పంపారట! ఈ విషయాన్ని సదరు స్మిత ప్రకటించుకుంది. తనకు చంద్రబాబు నాయుడు చాలా సర్ ప్రైజ్ ఇచ్చినట్టుగా ఆమె ప్రకటించుకున్నారు! తను ఇరవైయేళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నందుకు గానూ చంద్రబాబు నుంచి అభినందపూర్వకమైన లేఖ అందినట్టుగా ఆమె ప్రకటించుకున్నారు.

ఇంతకీ ఈ పొలిటికల్ యాంగిల్ ఏమిటి? అంటే.. ఇదివరకూ ఈమె పొలిటికల్ కామెంట్లు చేసింది. తను తెలుగుదేశం పార్టీ వీరాభిమానిలా వ్యవహరించింది. అంతేకాదు.. ఈమె జగన్ మీద అక్కసు కూడా వెల్లగక్కింది. మరి జగన్ మీద అక్కసు వెల్లగక్కినందుకు గానూ చంద్రబాబు నాయుడు నుంచి ఈ మాత్రం అభినందనలు ఉంటాయేమో!

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?