Advertisement

Advertisement


Home > Politics - Political News

దేశంలో మరింత పెరిగిన కరోనా కేసులు

దేశంలో మరింత పెరిగిన కరోనా కేసులు

రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నాటికి దేశంలో 5734కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరిలో 166 మంది మరణించారని, 5095 మంది ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచి ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో ఈరోజు ఉదయం నాటికి మొత్తంగా 1135 కేసులు నమోదుకాగా.. తమిళనాడులో 738, ఢిల్లీలో 669 కేసులు నమోదయ్యాయి.

ఇక మరణాల విషయానికొస్తే.. అత్యథికంగా మహారాష్ట్ర నుంచి 72 మంది మృతిచెందగా.. గుజరాత్ లో 16 మంది, మధ్యప్రదేశ్ లో 13 మంది మరణించారు. 11 మంది మృతులతో తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. గుజరాత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే (179 మాత్రమే) ఉన్నప్పటికీ, మరణాలు ఎక్కువగా ఉండడం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అటు మధ్యప్రదేశ్ లో కరోనా నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా కోలుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయం.

దేశంలో మరో 4-5 రోజుల పాటు కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రమాదముందని కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు లాక్ డౌన్ పొడిగింపుపై వస్తున్న ఊహాగానాల్ని కేంద్రం కొట్టిపారేసింది. దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని, బహుశా శనివారం రివ్యూ చేసే అవకాశం ఉండొచ్చని తెలిపింది.

చంద్ర‌బాబు ఆ డాక్టర్‌తో మంచి నాటకం ఆడించారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?