Advertisement

Advertisement


Home > Politics - Political News

వావ్‌...హీరోయిన్ స‌హ‌నానికి హ్యాట్సాప్‌

వావ్‌...హీరోయిన్ స‌హ‌నానికి హ్యాట్సాప్‌

స‌హ‌నం స‌ముద్రానికంటే గొప్ప‌దంటారు. క్లిష్ట ప‌రిస్థితుల్లో స‌హ‌నం పాటిస్తే కాల‌మే ప‌రిష్కార మార్గం చూపుతుందంటారు. మ‌నిషికి స‌హ‌నానికి మించిన సంప‌ద ఉండ‌దు. స‌హ‌నం మ‌నిషి వ్య‌క్తిత్వానికి అగ్ని ప‌రీక్ష లాంటిది. ప‌రీక్షా స‌మ‌యంలో మ‌నిషి ఓర్పుతో వ్య‌వ‌హ‌రిస్తే...దాని ఫ‌లాలు అద్భుతంగా ఉంటాయి. అంతేకాదు, ఆ మ‌నిషి ఔన్న‌త్యాన్ని కూడా చాటి చెబుతుంది. అలాంటి వాళ్లు స‌మాజ మ‌న్న‌న‌లు పొందుతారు.

బాలీవుడ్ హీరోయిన్ వాణీ క‌పూర్ త‌న స‌హ‌నంతో అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. త‌న శరీరం గురించి అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేసిన నెటిజ‌న్‌కు సుతిమెత్త‌గా హిత‌వు చెబుతూ త‌గిన కౌంట‌ర్ ఇచ్చారు. వాణీ క‌పూర్ శ‌రీరం గురించి నెటిజ‌న్ కాస్తా ఘాటుగా కామెంట్ చేసిన‌ప్ప‌టికీ...ఆమె ఎక్క‌డా సంయ‌మ‌నాన్ని కోల్పోలేదు.  

లాక్‌డౌన్ వేళ‌లో అభిమానుల‌తో ముచ్చ‌టించేందుకు సోమవారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి  వాణి వ‌చ్చారు. త‌మ అభిమాన న‌టిని నెటిజన్లు ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. వాటికి ఆమె ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఇదే స‌మ‌యంలో ఓ పోకిరి నెటిజన్ వాణి శరీరం గురించి అభ్యంత‌క‌ర కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌పై వాణి స్పందిస్తూ... `మీకు హృదయం ఉంది. కాస్త మనసుతో ఆలోచించండి. అనవసరంగా ఎదుటివారిని ద్వేషించకండి` అని త‌న‌దైన శైలిలో గ‌డ్డి పెట్టారు. వాణి స‌హ‌నానికి ముగ్ధులైన నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. 

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?