Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణలో ఏం జరుగుతోంది.. నేడే ఐసీఎంఆర్ సర్వే

తెలంగాణలో ఏం జరుగుతోంది.. నేడే ఐసీఎంఆర్ సర్వే

కరోనా విషయంలో ఇప్పటికే విమర్శలపాలైంది తెలంగాణ ప్రభుత్వం. అతి తక్కువ టెస్టులు చేస్తూ కరోనా కేసుల్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోందని అటు కేంద్రంతో పాటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం కొంతమందికి మాత్రమే టెస్టులు చేసి మిగతా వాళ్లను వదిలేస్తున్నారని విమర్శిస్తున్నాయి. అయితే ఎంత తక్కువ చేసి చూపిద్దామన్నా తెలంగాణలో కరోనా తగ్గడం లేదు సరికదా రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిపై సర్వే చేయాలని నిర్ణయించింది భారతీయ వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్.

హైదరాబాద్ లోని 5 కంటైన్మెంట్ జోన్లలో ఈరోజు, రేపు ఈ సర్వే జరుగుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టనున్న ఐసీఎంఆర్.. అసలు హైదరాబాద్ లో వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతోంది, ఎందుకు కేసుల సంఖ్య పెరుగుతోందనే విషయంపై ఆరా తీయబోతోంది. ఆ తర్వాత తన నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పిస్తుంది.

నిన్నటికినిన్న గ్రేటర్ లో ఒకేసారి 82 కరోనా కేసులు వెలుగుచూశాయి. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో మరో 14 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ పరిథిలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ సర్వేకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సిటీలోని మియాపూర్, చందానగర్, బాలాపూర్, ఆదిభట్లలోని కంటైన్మెంట్ జోన్లలో ఈరోజు సర్వే జరుగుతుంది. ఇప్పటికే ప్రతి జోన్ కు 2 టీమ్స్ చొప్పున ఏర్పాటుచేశారు. 

అసలు విషయం మర్చిపోయిన చంద్రబాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?