Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Political News

కరోనా టెర్రర్.. ప్రపంచంలో మనమే నంబర్ వన్

కరోనా టెర్రర్.. ప్రపంచంలో మనమే నంబర్ వన్

కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 3 లక్షల మార్క్ దాటిన ఇండియా.. ప్రపంచంలోనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా నిలిచింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,15,552 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఇదే ప్రస్తుతానికి అత్యథికం.

సెకెండ్ వేవ్ లో భాగంగా 17 రోజుల కిందట ఇండియాలో లక్ష కేసులు నమోదయ్యాయి. అంటే 3 వారాలు కూడా తిరక్కముందే కేసులు మూడింతలయ్యాయి. అమెరికాలో కేసుల పెరుగుదల కంటే.. నాలుగింతలు ఎక్కువగా ఇండియాలో పాజిటివ్స్ పెరుగుతున్నాయి. దేశంలో ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం.

ఇలా 3 లక్షల కేసులు జనవరి నెలలో అమెరికాలో నమోదయ్యాయి. ఆ తర్వాత అక్కడ తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఇండియా కూడా ఆ మార్క్ చేరుకుంది. ఈ పెరుగుదల మరో వారం రోజులు కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో అత్యథికంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ లో కూడా ఈ రాష్ట్రమే అత్యథికంగా కరోనా కేసులు నమోదుచేసే రాష్ట్రంగా నిలిచింది. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఉన్నాయి.

మరోవైపు కేంద్రం టీకా పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేసింది. ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు కూడా టీకాలు ఇవ్వబోతోంది. దీంతో పాటు ఇప్పటికే కరోనాతో బాధపడుతున్న వ్యక్తులకు రెమిడెసివిర్ ఇంజెక్షన్లను భారీ ఎత్తున అందిస్తోంది. 

అత్యథికంగా కేసులు నమోదవుతున్న 11 రాష్ట్రాలకు ఈనెల 30 వరకు 11 లక్షల ఇంజెక్షన్లు అందించనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 59వేలు, తెలంగాణకు 21,500 రెమిడెసివిర్ ఇంజిక్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?