Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇక వాళ్ల ఆటలు సాగవ్: జగన్ వార్నింగ్

ఇక వాళ్ల ఆటలు సాగవ్: జగన్ వార్నింగ్

రాష్ట్రంలో ఇకపై ఎలాంటి భూకబ్జాలు జరగడానికి ఆస్కారం ఉండదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడులో "వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష" కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి.. ప్రతి రైతుకు, ప్రతి భూ హక్కుదారుడికి శాశ్వత హక్కు కల్పించేలా చారిత్రాత్మక కార్యక్రమానికి స్వీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, కొన్ని అరాచక శక్తులకు, కబ్జాదారులకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. వ్యవస్థల్లో లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఇకపై భూకబ్జాలకు పాల్పడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షం టీడీపీపై కూడా తనదైన శైలిలో పంచ్ లు వేశారు సీఎం. టీడీపీ నేతల్ని రాక్షసులతో పోలుస్తూ జగన్ వేసిన పంచ్ టోటల్ ప్రసంగంలో హైలెట్ గా నిలిచింది.

"ఇదొక యజ్ఞం. ఇలాంటి యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా కొందరు దెయ్యాలు-రాక్షసులు ఉన్నారు. వాళ్లెవరో ప్రత్యేకంగా మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. మన ఖర్మ కొద్దీ ఆ రాక్షసులకు ఎల్లో మీడియా తోడు కూడా ఉంది. వీళ్లంతా తప్పుడు ప్రచారాలు చేస్తారు."

భూమికి సంబంధించిన శాశ్వత పత్రం అందిన తర్వాత ఇకపై క్రయ-విక్రయాలన్నీ గ్రామ స్థాయిలోనే సెక్రటేరియట్ వేదికగా జరుగుతాయని, ఎవ్వరూ 4-5 ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని స్పష్టంచేశారు జగన్. 

భూమి హక్కు సర్టిఫికేట్ పొందిన తర్వాత సదరు భూమిపై, హక్కు పొందిన యజమానికి హక్కు లేదని తేలితే, రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. అంగుళాలు, మిల్లీమీటర్లతో సహా భూమిని సర్వే చేయించి, ప్రభుత్వమే ఉచితంగా సర్వే రాళ్లు కూడా వేయిస్తుందని జగన్ హామీ ఇచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?