Advertisement

Advertisement


Home > Politics - Political News

జయదేవ్ గారు! మరీ ఇంత దిగజారుడుతనమా?

జయదేవ్ గారు! మరీ ఇంత దిగజారుడుతనమా?

ఒక పక్కన మీ వర్గం వార్తాపత్రికలు అమరరాజాకి జరుగుతున్న అన్యాయం అంటూ ప్రభుత్వవ్యతిరేక జ్వాలలు మండిస్తున్నాయి. 

మీ పార్టీకి సానుభూతిపరులైన టీవీ చానళ్లు చర్చలు పెట్టి రచ్చ చేస్తున్నాయి. కమ్మవారి కంపెనీ అని వెళ్లగొడుతున్నారని మీ సోషల్ మీడియా ప్రబుద్ధులు తోచినట్టు రాస్తున్నారు. 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలకి, కోర్టు ఆదేశాలకి కట్టుబడకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే లెక్కనైతే మా రాష్ట్రంలో ఉండనక్కర్లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే దానికి పెడార్థాలు తీసి, "అదిగో ప్రభుత్వమే పొమ్మని పొగబెట్టింది" అని కోడుగుడ్డు మీద ఈక పీకారు మీ సామాజిక వర్గానికి చెందిన ఎందరో. 

ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో తమరు నోరు మెదపలేదు. పార్లెమంటు సెషన్ జరుగుతున్నా అక్కడా మీరు పెదవి విప్పలేదు. నిజంగా అన్యాయం జరిగితే మీరు కదా గోడు చెప్పుకోవాల్సింది? కందకి లేని దురద కత్తి పీటకన్నట్టుగా మీ పార్టీకి చెందిన కులపు పత్రికలు, చానల్స్ ఎందుకు తైతక్క నాట్యం చేస్తున్నాయి? 

రోము నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం పరువు మీద బురద పడుతుంటే మీరు కూడా ఫిడేల్ వాయించుకుంటూ ఆ వార్తల్ని చూస్తూ ఎంజాయ్ చేసారా? 

అస్సలు సిగ్గు శరం లేకుండా, "నేను అమరరాజాకి సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాను. అవన్నీ పుకార్లే. అలాంటి స్పెక్యులేషన్స్ మీద నేను స్పందించను. మా ఫ్యాక్టరీ ఎక్కడికీ వెళ్ళిపోవట్లేదు. విషయం కోర్టులో ఉంది. వారు చెప్పినట్టు నడుచుకుంటాం" అని ఈ రోజు చెప్తారా? ఈ మాటేదో మొదటి వార్త వచ్చినప్పుడే చెప్పొచ్చుగా? దీనిని కుట్ర కాక ఇంకేమంటారు? 

మీ వర్గం మీద జనానికి అసహ్యం వేసేది ఇలాంటి పనుల వల్లే. మీ సమస్య కాలుష్యానికి సంబంధించినది, కార్మికుల ఆరోగ్యానికి సంబంధించినది. ఇప్పటికే మీ ఉద్యోగుల రక్త నమూనాల్లోనూ, ఫ్యాక్టరీ చుట్టు పక్కల నీటిలోనూ ప్రమాదకర స్థాయిలో లెడ్ అవశేషాలున్నాయని అధికారులు చెప్పారు. ఈ పద్ధతిలో అయితే ఈ ఫ్యాక్టరీని మూసేయడం తప్ప మరో మార్గం లేదని పొల్యూషన్ కంట్రోల్ వారు చెప్పారు. వారికి మీరిచ్చిన సమాధానం ఏమిటో ఇంతవరకూ తెలియదు. కనీసం ఆ విషయం మీద కూడా తమరు నోరు విప్పలేదు. "మా వాదన కోర్టులో వినిపిస్తాం. తీర్పు తర్వాతే స్పందిస్తాం" అని ఇప్పుడు అంటున్నారు. 

ఈ లోగా మీ వర్గం మీడియా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించేసి ప్రజల ముందు దోషిలా నిలబెట్టే ప్రయత్నాలు చేసేసింది. మీరు మౌనవ్రతం పాటించి వారి క్షుద్రయాగానికి మరింత చేయూతనిచ్చారు. 

నిజంగా ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎత్తి చూపండి. అంతే తప్ప మీ తప్పున్నప్పుడు కూడా దానిని కప్పిపుచ్చి ప్రభుత్వాన్ని తప్పుబట్టడం దిగజారుడుతనం. అది ఒక్క అమరరాజా విషయంలోనే కాదు పోయిన ఏడాది టీడీపీ నాయకులపై అరెస్టు వారెంట్లొస్తే ప్రతిపక్షం మీద ప్రభుత్వ దాడి అన్నారు తప్ప ఆయనగారు చేసిన తప్పుల గురించి మాట్లాడలేదు. 

చదువుకున్న మీలో అయినా హుందా తనం ఉంటుందని ఆశించాం. కానీ మీరు కూడా ఆ తాను ముక్కే కనుక ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని కమ్మగా లొట్టలేస్తూ ఆరగించినట్టున్నారు.  

ఒక్క విషయంలోనైనా చిత్తశుద్ధి ఉంటుందేమో బూతద్దం వేసుకుని వెతుకుదామన్నా అణువణువునా చెత్తబుద్ధే తప్ప మరొకటి కనపడని పార్టీ తమది. 

మీరు ఇలా ఉన్నంతవరకు జగన్ మోహన్ రెడ్డి సీయం కుర్చీ దిగరు. ఎందుకంటే మీ పార్టీ బలహీనత, మెజారిటీ ప్రజలకి మీ పార్టీ పట్ల ఉన్న అసహ్యం కారణంగానే ఆయన పరిపాలన తిరుగులేకుండా సాగుతోంది. 

శాంతికుమార్ అద్దేపల్లి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?