Advertisement

Advertisement


Home > Politics - Political News

ఊరు రాలేడు కానీ... చినబాబు పెద్ద మాటలు

ఊరు రాలేడు కానీ... చినబాబు పెద్ద మాటలు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో దుర్ఘటన జరిగి నెలరోజులు అవుతోంది. అయినా దాన్ని రాజకీయం చేద్దామన్న పచ్చ పూనకాలు మాత్రం తగ్గడంలేదు. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నా కూడా అగ్గిరాజేద్దామన్న రాజకీయ దురాశ పోలేదు.

తాజాగా  చినబాబు లోకేష్ ట్వీటేస్తూ ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో మళ్ళీ మళ్ళీ ఏడుపులూ,  పెద్ద దీర్ఘాలు తీశారు. రాష్త్ర ప్రభుత్వం వైఖరి వల్లనే ఎల్జీపాలిమర్స్ బాధితుల స్థితి  అలాగే ఉందని పెడబొబ్బలు పెడుతున్నారు.

ఇంతకీ విశాఖ వస్తామన్న చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఈ వైపు తొంగి చూడలేదు, వంగివాలలేదు. హైదరాబాద్ లో సెల్ఫ్ క్వారటైన్లో టైం పాస్ చేస్తూ చేతిలో ట్వీట్ ఉంది కదా తోచుకొచ్చినట్లుగా ట్వీటేస్తున్నారు.

ఇంతకీ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఏమైంది. వారికి ఏం కావాలి, ఇవన్నీ దగ్గరకు వచ్చి పరామర్శ చేస్తే కదా తెలిసేది. దొంగలు పడిన ఆరునెలలకు అన్నట్లుగా కూడా విశాఖ రాలేకపోతున్న చినబాబు పెదబాబు తమకేదో పాలిమర్స్ బాధితుల మీద అతి పెద్ద  ప్రేమ ఉన్నట్లుగా కడివెళ్ళ కొద్దీ కన్నీళ్ళను ట్వీట్ల ద్వారా కురిపించేస్తే సరిపోతుందనుకుంటున్నారు.

ఇదే చీప్ రాజకీయం అంటారు తమ్ముళ్ళూ అని వైసీపీ నేతలు గట్టిగానే పెట్టాల్సింది పెడుతున్నా కూడా ట్వీట్ వీరుడు చినబాబు మాత్రం శాంతించడంలేదుగా.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?