Advertisement

Advertisement


Home > Politics - Political News

ప‌ట్టాభి త‌మ్ముడిలా ఉన్నాడే!

ప‌ట్టాభి త‌మ్ముడిలా ఉన్నాడే!

అభ్యంత‌ర‌క‌ర భాష మాట్లాడ్డంలో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభికి నారా లోకేశ్ త‌మ్ముడిలా ఉన్నారు. పార్టీ భ‌విష్య‌త్ ర‌థ‌సా ర‌థిగా ప్ర‌చారంలో ఉన్న లోకేశ్ త‌న స్థాయిని త‌న‌కు తానుగా దిగ‌జార్చుకుంటూ వ‌రుస‌ ట్వీట్లు చేశారు. ప్ర‌జాక్షేత్రంలో స‌త్తా చూపించ‌లేక‌పోయిన లోకేశ్‌... ట్విట‌ర్‌లో మాత్రం చెల‌రేగిపోయారు.

జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. లోకేశ్ ట్వీట్లు ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌, షేకింగ్ న్యూస్‌లుగా వేసుకోడానికి ప‌నికొస్తాయే త‌ప్ప‌... రాజ‌కీయంగా మాత్రం ప‌త‌నానికి దారి తీస్తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలోనే నాయ‌కుడి హూందాత‌నం, పెద్ద‌రికం బ‌య‌ట‌పడ‌తాయి. టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్ త‌న‌ది ప‌ట్టాభి స్థాయి అని మ‌రోసారి రుజువు చేసుకున్నారు.

ట్విట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్‌పై లోకేశ్ అవాకులు చెవాకులు పేలారు. ఇష్టానుసారం అక్ష‌ర ప్రేలాప‌న‌కు పాల్ప‌డ్డారు. త‌మ కార్యాల యాల‌పై ప్ర‌త్య‌ర్థులు దాడికి పాల్ప‌డేలా ప్రేరేపించింది ప‌ట్టాభే అని విష‌యాన్ని విస్మ‌రించి, త‌గ‌దున‌మ్మా అని ప్ర‌తిదాడికి పాల్ప‌డ‌డం టీడీపీ నేత‌ల‌కే చెల్లింది. స్థాయిని త‌గ్గించే లోకేశ్‌ ట్వీట్ల‌ను ఒక సారి ప‌రిశీలిద్దాం.,

‘ఇప్ప‌టివ‌ర‌కూ ముఖ్య‌మంత్రి అని గౌర‌వించి గారూ అనేవాడిని. నీ వికృత‌, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ వైఎస్ జగన్‌ అని అంటున్నాను. టీడీపీ కేంద్ర‌ కార్యాల‌యాల‌పై గూండా మూక‌ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ‌తావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం. అన్ని ఆన‌వాయితీల‌ని బ్రేక్ చేసి, ప్ర‌జాస్వామ్యానికి పాత‌రేసి.. నీ స‌మాధికి నువ్వే గొయ్యి త‌వ్వుకుంటున్నావు కోడికత్తిగా’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

సైకో, శాడిస్ట్‌, డ్ర‌గ్గిస్ట్ వైఎస్ జ‌గ‌న్‌, కోడిక‌త్తిగా...ఏంటీ రాత‌లు? గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరిలో నిలిచి తేల్చుకున్న‌దేంటో అంద‌రికీ తెలుసు క‌దా లోకేశ్‌. ఒక పార్టీ అధినేత కుమారుడివైన త‌మ‌రు, మంత్రిస్థాయిలో కొన‌సాగుతూ ఓట‌మి పాలు కావ‌డం సిగ్గుగా లేదనే ప్ర‌శ్న‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారు? ఇప్ప‌టికీ ఒక నియోజ‌క‌వ‌ర్గ‌మంటూ లేని త‌మ‌రు జ‌గ‌న్‌తో ఏం తేల్చు కుంటారు? కోడికత్తిగా అని అంటే ఎవ‌రి స్థాయి ప‌త‌న‌మ‌వుతుందో లోకేశ్ తెలుసుకుంటే మంచిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?