Advertisement

Advertisement


Home > Politics - Political News

రైతుకు మరింత భరోసా.. జగన్ మరింత సహకారం!

రైతుకు మరింత భరోసా.. జగన్ మరింత సహకారం!

రైతు భరోసా పథకం కింద ముందుగా ప్రకటించిన ఏడాదికి పన్నెండు వేల రూపాయల మొత్తానికి మరింత భరోసాను యాడ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున పెంచి, ప్రతియేటా పదమూడు వేల ఐదువందల రూపాయల మొత్తాని పెట్టుబడి సాయంగా అందించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ పథకం అమలులో పలు మార్పులు చేసింది.

ఈ ఏడాదికి ఇప్పుడు భరోసాను అందిస్తున్నప్పటికీ, వచ్చే ఏడాది నుంచి మూడు విడతలుగా ఈ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి సమయంలో ఒక విడత, మేలో మరో విడత, నవంబర్లో మూడో విడత పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్టుగా ప్రకటించారు. రైతు సంఘాల కోరిక మేరకు ఈ మేరకు మార్పును చేసి, ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున సాయాన్ని పెంచి.. ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా ప్రకటించారు.

అలాగే ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ పథకం పేరులో ప్రధానమంత్రి సాయం అనేమాటను కూడా యాడ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం వాటా ఈ పథకంలో ఆరువేల రూపాయల వరకూ ఉంది. మిగిలిన ఏడువేల ఐదు వందల రూపాయల మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వాటా. ఈ పథకం అమలుకు ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలకు పైగా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?