Advertisement

Advertisement


Home > Politics - Political News

ఒక్క బీసీలే దూరమయ్యారా అచ్చెన్నా?

ఒక్క బీసీలే దూరమయ్యారా అచ్చెన్నా?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి గల కారణాలను తెలుసుకోవడంలో పసుపు పార్టీ నేతల నిజాయతీ పెద్దగా కనిపించడంలేదని విమర్శలు ఉన్నాయి. ఎంతసేపూ ఆత్మ స్తుతి పర నింద అన్నట్లుగానే గత ఏడాదిగా టీడీపీ గడిపేసింది. ఇక రెండు రోజుల మహానాడులో కూడా ఇదే తంతు నడిచింది.

బీసీలల్లో కొంత అసంత్రుప్తి ఉందని బీసీ తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అది కొంత కాదు కొండంత అని వైసీపీకి దక్కిన భారీ విజయాన్ని చూసి అయినా ఇప్పటికీ అంచనాకు రాకపోవడం అచ్చెన్న లాంటి తమ్ముళ్ళు మొక్కుబడి సమీక్షలకు నిదర్శనంగా చూడాలి.

సరే బీసీలు ఎందుకు అసంత్రుపి చెందారంటే కాపూల్కు అయిదు శాతం రిజర్వేషన్లు ప్రకటించడం వల్లట. మరి ఆ రిజర్వేషన్ల ఫలితాలు కాపులకు దక్కాయా అంటే అదీ లేదు. ఇక నలభయి వేల కోట్ల రూపాయలు తాము బీసీలకు ఏటా ఖర్చు చేశామని చెప్పుకుంటున్న నాటి బీసీ మంత్రి అచ్చెన్న వారి అసంత్రుప్తికి కాపుల రిజర్వేషన్లే కారణమని చెప్పడం కూడా తప్పే.

బీసీల విషయంలోనాటి పాలకుల‌ అసలైన చిత్తశుధ్ధి కొరవడింది. వారికి పదవులు కేవలం అలంకార ప్రాయమయ్యాయి. కీలక పదవులు దక్కలేదు. నాలుగు దశాబ్దలుగా పార్టీ పల్లకీ మోసిన తరువాత కూడా ఉపయోగం లేదని వారంత పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అందుకే టీడీపీ ఓడింది. ఇదే అసలు విషయం కదా.

ఇక ఒక్క బీసీలే పార్టీకి దూరం అయ్యారా, అన్ని వర్గాలు టీడీపీకి దూరం అయ్యాయి. ఆ సంగతి మాత్రం చెప్పకుండా కొంచెం కొంచెం అసంత్రుప్తి  ఆయా వర్గాల్లో ఉందని త్రుప్తి పడుతూ తూతూ మంత్రంగా సమీక్షకు ముగిస్తే మహానాడుకు అర్ధముంటుందా. మరి ఎంతసేపూ వైసీపీని, జగన్ని విమర్శించడమే తప్ప తమ తప్పులు తెలుసుకోనంతవరకూ తమ్ముళ్ళకు ఓటమికి దారి తీసిన కారణాలు కనబడవు, బోధపడవు అనుకోవాలేమో.

జ‌గ‌న్ ముందు మ‌రోసారి కేసీఆర్ కూడా చిన్న‌బోతున్నారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?