Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ‍... హైదరాబాద్ పోటాపోటీ... ?

విశాఖ‍... హైదరాబాద్ పోటాపోటీ... ?

హైదరాబాద్ తో విశాఖ పోటీ పడుతోంది. సమ ఉజ్జీగా నిలుస్తోంది. ఏ విషయంలో అంటే కాలుష్యంలో అని చెప్పాలి. నిజానికి కాలుష్యం అన్నది అభివృద్ధికి రెండవ వైపు ఉండేదే. ఒకటి మంచిదైతే రెండవ దాన్ని భరించాలి. అయితే కేవలం ప్రగతి కోసం ప్రాణాలు తీసుకోవాలా అంటే దానికీ జవాబు ఉంది. కాలుష్యాన్ని అరికడుతూ కూడా అభివృద్ధి చేయవచ్చు.

అయితే పరిశ్రమల్లో కాలుష్యం ఒక ఎత్తు అయితే ప్రజలు తమ వాహనాల ద్వారా వెదజల్లుతున్న కాలుష్యం దానికి మరింత ఎక్కువ అంటున్నాయి నివేదికలు. తాజాగా చూస్తే కాలుష్యంలో ఏపీలో విశాఖ నంబర్ వన్ గా ఉందని, హైదరాబాద్ తోనే పోటీపడుతోందని గ్రీన్ పీస్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం చూస్తే కేవలం ఏడాది అంటే 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ దాకా చూసుకుంటే పార్టిక్యులేట్ మ్యాటర్ అయిదింతలుగా విశాఖలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది అంటున్నారు. పీల్చే గాలిలో ధూళితో పాటు, వాయు ఉద్గారాలు విశాఖలో అధికమని ఆ నివేదిక తేల్చింది.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి స్థాయిలో చూసుకుంటే క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రో గ్రాముల కంటే ఆరేడు రెట్లు విశాఖతో పాటు హైదరాబాద్ గాలిలో వ్యాపించిన కాలుష్యం ఉందని అంటున్నారు. ఇక హైదరాబాద్ లాంటి చోట్ల అయితే సగానికి సగం వాహనాల నుంచే కాలుష్యం వ్యాపిస్తోంది అంటున్నారు.

ఏపీలో విశాఖ తరువాత స్థానంలో విజయవాడ ఉంది. కేవలం ఏడాదిలో అక్కడ కూడా నాలుగైదు రెట్లు కాలుష్యం రేటింగ్ పెరిగింది. ఒక విధంగా ఇది ప్రజారోగ్య సంక్షోభం అని గ్రీన్ పీస్ ఇండియా హెచ్చరిస్తోంది. మరి ఇంతటి కాలుష్యం కబలిస్తూంటే ఉత్తరాదిని మించి దక్షిణాది పోటీ పడుతూ సాగుతూంటే ప్రజల ఆరోగ్యం పెద్ద ముప్పులో పడినట్లే అంటున్నారు. దీని నివారణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?