Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Political News

ఏపీ హై కోర్టు ఆదేశాలు షాకింగ్.. ప్ర‌శాంత్ భూష‌ణ్ స్పంద‌న‌

ఏపీ హై కోర్టు ఆదేశాలు షాకింగ్.. ప్ర‌శాంత్ భూష‌ణ్ స్పంద‌న‌

అమరావ‌తి అక్ర‌మాల వ్య‌వ‌హారంలో ఏపీ హైకోర్టు తీర్పు విస్మ‌య‌క‌రంగా ఉంద‌ని, అది నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని కూడా ట్వీట్ చేశారు ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు ఇది వ‌ర‌కూ సంచ‌ల‌నంగా నిలిచాయి. ఈ క్ర‌మంలో ఏపీ హై కోర్టు తీర్పు గురించి ఆయ‌న ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కే త‌ను క‌ట్టుబ‌డిన‌ట్టుగా ఆయ‌న మ‌రో ట్వీట్ కూడా పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ఆయ‌న ఏమంటారంటే.. 'మాజీ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్, ఇత‌ర ప్ర‌ముఖులు అయిన‌ నిందితుల‌పై ఏపీ ప్ర‌భుత్వం న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ గురించి మీడియాలో కానీ, సోష‌ల్ మీడియాలో కానీ స్పందించ‌డానికి వీల్లేదంటూ హై కోర్టు ఆదేశాలు నాకు షాక్ నిచ్చాయి. హై కోర్టు ఆదేశాలు స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 19కూ విరుద్ధం...' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఆ త‌ర్వాత మ‌రికొంత సేప‌టికి ఆయ‌న మ‌రో ట్వీట్ పెట్టారు ఇదే అంశం గురించి. ఈ విష‌యంలో త‌న స్పంద‌న‌కు క‌ట్టుబ‌డిన‌ట్టుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా  ఔట్ ఆఫ్ ఆర్డ‌ర్ అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అది కేవ‌లం భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు విరుద్ధ‌మే కాకుండా, కొత్త రూమ‌ర్ల‌కు అవ‌కాశం ఇస్తుంద‌ని ఆయ‌న విశ్లేషించారు.

ఏపీ హై కోర్టు  ఆదేశాల ప‌ట్ల ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టులు కూడా స్పందించారు. ఇండియాటుడే రాజ్ దీప్ స‌ర్దేశాయ్, ఎన్డీటీవీ ఉమా సుధీర్ వంటి వారు కూడా.. ఒక మాజీ అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ , సుప్రీం కోర్టు సిట్టింగ్ జ‌డ్జి కూతుర్ల అవినీతి గురించి చ‌ర్చించ‌కూడ‌దంటూ ఏపీ హై కోర్టు నిబంధ‌న‌లు పెట్టింద‌ని వారు ట్వీట్ చేశారు.

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది

నాగ‌బాబూ ...మ‌రీ ఇంత దిగ‌జారుడేంది?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?