Advertisement

Advertisement


Home > Politics - Political News

రాజీనామాకు సిద్ధం

రాజీనామాకు సిద్ధం

విజ‌య‌వాడ టీడీపీలో విభేదాలు ఒక్క‌సారిగా బ‌ద్ద‌ల‌య్యాయి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిపై  విజ‌య‌వాడ న‌గ‌ర టీడీపీ త్రిమూర్తులుగా పేరొందిన బొండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డడ‌డంతో పార్టీ శ్రేణులు అయోమ‌య్యానికి గుర‌వుతున్నాయి. ఎంపీ కేశినేని కావాలో, తాము కావాలో తేల్చుకోవాల‌ని ఆ త్రిమూర్తులు టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పారు.

తన‌పై సొంత పార్టీ నేత‌లే అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో కేశినేని స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా నెల‌కున్న ఉత్కంఠ‌కు ఆయ‌న తెర‌దించారు. అధినేత చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామాకు సిద్ధమని తేల్చి చెప్పారు. అసలు చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదని నాని అన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కలిసి రూపొందించాయన్నారు.

ఒక‌వేళ తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసినవారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చని స‌ల‌హా ఇచ్చారు. విభేదాలు ఉన్నాయని వారుంటున్నారని, లేవని తానంటున్నానని కేశినేని ఎంతో తెలివిగా చెప్పుకు రావ‌డం గ‌మ‌నార్హం. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న‌పై అభ్యంత‌ర‌క‌ర‌, ఘాటు విమర్శలను ఆ ముగ్గురి విచక్షణకు వది లేస్తున్న‌ట్టు కేశినేని నాని ప్ర‌క‌టించ‌డం విశేషం.

విజయవాడ కార్పొరేషన్‌పై తెలుగుదేశం జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమన్నారు. పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని, తన దారిలో తాను వెళ్తుంటే తనకు తెలియని బాధలు కొందరికి ఉన్నాయేమోనని, ఆ విషయం తనకు తెలియదని ఆ ముగ్గురిపై న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.  ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కుందన్నారు. 

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?