Advertisement

Advertisement


Home > Politics - Political News

రేషన్ కార్డుల జారీ.. ఏపీలో సీన్ రివర్స్

రేషన్ కార్డుల జారీ.. ఏపీలో సీన్ రివర్స్

రేషన్ కార్డుల కోసం పేదలు తంటాలు పడటం ఇప్పటి వరకు చూశాం. జగన్ హయాంలో అధికారులే రేషన్ కార్డుల కోసం కష్టాలు పడుతున్నారు. ఇదేంటి ఈ పరిస్థితి అనుకుంటున్నారా..? అవును.. రేషన్ కార్డులు సకాలంలో మంజూరు చేయడం కోసం ఎమ్మార్వోలు, వీఆర్వోలు ఇబ్బంది పడుతున్నారు. అలా చేయనివారిపై వేటు వేసేందుకు సైతం ఉన్నతాధికారులు వెనకాడకపోవడంతో ఏం చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు.

అసలు విషయం ఏంటంటే...

గతంలో రేషన్ కార్డు అనే ఓ గుర్తింపు కోసం ప్రజలు నానా అవస్థలు పడేవారు. అధికారులకు అర్జీలు పెట్టుకుని కాళ్లరిగేలా తిరిగేవారు. రేషన్ కార్డు దక్కక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.

కొత్త కార్డులకు అప్లై చేసుకుంటే 10 రోజుల్లోగా దాని సంగతి తేల్చాలి, లేకపోతే ఎందుకివ్వలేకపోతున్నారనే విషయాన్నయినా స్పష్టం చేయాలి. ఇవ్వకపోవడానికి కారణాలేవీ లేకపోవడంతో అర్జీదారులకు వెంటనే కార్డులు మంజూరు చేస్తున్నట్టు శాంక్షన్ అనే టిక్ మార్క్ కొట్టేస్తున్నారు వీఆర్వోలు.

ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సదరు అర్జీ దారులు, వారి కుటుంబ సభ్యులు వేరే ఊరికి పనిమీద వెళ్తే.. ఈలోపు ఇక్కడ కార్డు శాంక్షన్ అయినట్టు వీఆర్వో అథెంటికేషన్ ఇచ్చేస్తే.. విషయం తారుమారవుతోంది. వీఆర్వో కార్డు శాంక్షన్ చేసిన తర్వాత వెంటనే అర్జీదారుడు వాలంటీర్ వద్దకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

ఇష్యూ కార్డ్, ఈకేవైసీ అనే ప్రక్రియలు జరిగితేనే సదరు వీఆర్వో పనిచేసినట్టు లెక్క. ఆ రెండూ చేయకపోతే వారి లిస్ట్ లో రేషన్ కార్డులు పెండింగ్ చూపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అర్జీదారులు దొరక్క, వారి ఫోన్ నెంబర్ కరెక్ట్ గా నమోదు కాక.. అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈకేవైసీ కాకపోతే వీఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి.

గతంలో అర్జీదారులు రేషన్ కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరిగితే, ఇప్పుడు అధికారులే అర్జీదారులను బతిమిలాడుకుంటున్నారు. వేలిముద్ర వేయండి, ఈకేవైసీ చేయించుకోండి అంటూ వేడుకుంటున్నారు. ఈ సీన్ చూసిన ఎవరికైనా జగన్ రెవెన్యూ వ్యవస్థలో ఎలాంటి మార్పు తెచ్చారో స్పష్టంగా అర్థమౌతుంది. 

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

నా ఆరోప్రాణం వెళ్ళిపోయింది..కె విశ్వనాధ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?