cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

రామోజీని ఏకిపారేస్తున్న సోష‌ల్ మీడియా...

రామోజీని ఏకిపారేస్తున్న సోష‌ల్ మీడియా...

ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావుపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో రామోజీని ట్రోల్ చేస్తూ ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా బారిన ప‌డ‌డానికి రామోజీనే కార‌ణ‌మ‌ని, రాలేను కుయ్యోమొర్రో అని వేడుకున్నా ... వినిపించుకోలేదంటూ నెటిజ‌న్లు ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

"రామోజీ ఎంత పాపం మూట‌గ‌ట్టుకున్నావు" అంటూ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా చ‌క్క‌ర్లు కొడుతున్న ఆ వార్త‌లోని ముఖ్య విష‌యాల గురించి చ‌ర్చిద్దాం.

ఈటీవీలో ఓ ప్రోగ్రాంలో ఎస్పీ బాలు పాల్గొనాల్సి ఉంది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌డం, దానికి తోడు 74 ఏళ్ల వ‌య‌సులో చెన్నై నుంచి హైద‌రాబాద్ వెళ్ల‌డం శ్రేయ‌స్క‌రం కాద‌ని బాలు భావించార‌ట‌!  "ద‌య‌చేసి నేను రాలేను. ఏమీ అనుకోకండి" అని బాలు బ‌తిమిలాడినా ... విన‌క‌పోవ‌డమే కాకుండా బెదిరించి మ‌రీ ప్రోగ్రాంకు ర‌ప్పించార‌ని స‌ద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతున్న వార్త సారాంశం.

రామోజీ లాంటి  మాఫియా మనిషిని ఇంతవరకూ ఎవ‌రూ చూసి ఉండ‌ర‌ని, ఈటీవీలో పని చేసే అందరితో  సంతకాలు చేయించుకొని అందరినీ ఇష్టమొచ్చినట్లు ఆడిస్తార‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు . 

ఒక‌వేళ అనుకోని పరిస్థితుల్లో  వాళ్ళు ప్రోగ్రాం చేయలేకపోతే నష్టపరిహారం చెల్లించాలని కోర్టులకి ఈడుస్తుంటార‌ని రామోజీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. గతంలో ' బాపు రమణ ' లని నీ సీరియల్స్ కోసం ఇదే విధంగా కాంట్రాక్టులు రాయించుకొని ఇబ్బందులు పెట్టారంటూ ప్ర‌స్తావించారు.

ఎస్పీ బాలును కూడా ఇట్లే బెదిరించి రప్పించి ఉంటార‌ని, కరోనా భయంతో ఆయ‌న ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలూ తీసుకొంటుంటే ..హఠాత్తుగా రామోజీ నుంచి పిలుపు వ‌చ్చిన‌ట్టు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చార‌మ‌వుతోంది. 

ఈటీవీలో  ఎపిసోడ్ల‌కు సంబంధించి షూట్ చేయాల‌ని, వెంట‌నే హైద‌రాబాద్ రావాల‌ని రామోజీ ఆదేశించార‌ని, రాలేన‌ని ఆయ‌న వేడుకున్నా క‌నిక‌రించ‌లేదంటూ నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఇక ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో బాలు త‌న భార్య‌, కుమారుడిని వెంట‌బెట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చి మూడురోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో ఉండి షూటింగ్‌లు పూర్తి చేసి వెళ్లారంటున్నారు. అయితే అంత‌కు ముందే రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యూజిక్ ట్రూప్‌లో 23 మంది క‌రోనా బారిన ప‌డ్డార‌ని, ఈ విష‌యం తెలిసి కూడా వాళ్ల‌ను బాలుతో క‌లిసి ప‌ని చేయించార‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

ఆ రోజు బాలుతో కలిసి పాడిన సునీత, ఇత‌ర ముఖ్యులు క‌రోనా బారిన ప‌డ్డార‌ని, అయితే వాళ్లంతా కోలుకున్నార‌ని పేర్కొ న్నారు. కానీ బాలు కోలుకోలేక మృత్యువును కౌగిలించుకున్నార‌ని సోష‌ల్ మీడియా క‌థ‌నంలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఈ వాస్త‌వాలు వెల్ల‌డించే ధైర్యం ఏ ఒక్క‌రూ చేయ‌లేర‌ని, ఎందుకంటే ఆయ‌న్ని ఎదురించే శ‌క్తి సామ‌ర్థ్యాలు ఏ ఒక్క‌రికీ లేవ‌ని తెలిపారు.  ఎన్టీఆర్ లాంటి మ‌హానేతే  రామోజీకి ఎదురు తిరిగి గాలిలో కలిసిపోయాడ‌ని, ఇక ఈ గాయకులెంత ? అనే ప్ర‌శ్న‌తో ముగించారు.

ఇందులోని నిజానిజాల సంగ‌తిని ప‌క్క‌న పెడితే ... రామోజీకి బాగా డ్యామేజీ క‌లిగించేలా ఉంది. గ‌తంలో ఓ సంద‌ర్భంలో రామోజీకి బాలు పాదాభివందనం చేసి త‌న అభిమానాన్ని చాటుకున్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో  ట్రోల్ జ‌రుగుతున్నంత దుర్మార్గంగా రామోజీ ఎప్ప‌టికీ ప్ర‌వ‌ర్తించ‌ర‌ని, బాలు ప్ర‌తిభ‌పై గౌర‌వం, న‌మ్మ‌కం ఉండ‌డం వ‌ల్లే కొన్నేళ్ల పాటు ఆయ‌న‌తో ఈటీవీలో సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించార‌ని రామోజీ అభిమానులు గుర్తు చేస్తున్నారు.

ఏది ఏమైనా రామోజీ నియంతృత్వం వ‌ల్లే బాలు క‌రోనా బారిన ప‌డి చ‌నిపోయార‌నే నెగెటివ్ ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో జ‌రుగుతుండ‌డం నిజం. మ‌రి రామోజీ ఏమంటారో!

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

 


×