Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనా చికిత్స: బయటపడుతున్న 'ప్రైవేటు' దందా

కరోనా చికిత్స: బయటపడుతున్న 'ప్రైవేటు' దందా

మొన్నటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ అంతా కలిసి ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంపై లేఖలతో ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ కరోనా వైద్యానికి ప్రైవేటు హాస్పిటల్స్ కు కూడా అనుమతి ఇచ్చింది. ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో ఇక అప్పట్నుంచి ప్రైవేటు ఆగడాలు దశలదశలుగా బయటపడుతూనే ఉన్నాయి.

3 రోజుల చికిత్సకు 7 లక్షల బిల్లు.. 5 రోజుల కరోనా ట్రీట్ మెంట్ కు 13 లక్షల బిల్లులు వచ్చినట్టు మనం చూశాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కింద రోజుకు లక్ష రూపాయలు బిల్లు కూడా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ హాస్పిటల్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ పై వేటు వేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ లో 2 ప్రముఖ హాస్పిటల్స్ పై వేటుపడింది.

హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న డెక్కన్ హాస్పిటల్ లో ఓ కరోనా పేషెంట్ చుక్కలుచూశాడు. కొన్ని రోజుల ట్రీట్ మెంట్ తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ హాస్పిటల్ సిబ్బంది అతడ్ని డిశ్చార్జ్ చేయలేదు. అదనంగా మరో 3 రోజులు ఉంచి 4 లక్షలు బిల్లు వేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆ హాస్పిటల్ కు కరోనా వైద్యం చేయడానికి ఇచ్చిన అనుమతిని రద్దుచేసింది.

ఇదే విధంగా తాజాగా విరించి హాస్పిటల్ పై కూడా వేటు వేసింది ప్రభుత్వం. బంజారాహిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ హాస్పిటల్ లో కరోనా పేషెంట్ల నుంచి నిలువుదోపిడీ జరుగుతోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై దృష్టిపెట్టిన పబ్లిక్ హెల్త్ అధికారులు.. విచారణలో అది నిజమని తేల్చారు. కరోనా వైద్యం చేయకుండా హాస్పిటల్ పై నిషేధం విధించారు.

కేవలం ఈ 2 హాస్పిటల్స్ మాత్రమే కాదు.. దాదాపు అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా ట్రీట్ మెంట్ కోసం లక్షలు వసూలు చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వం 10వేల రూపాయలతో చికిత్స సాధ్యమని చెబుతున్నప్పటికీ... ప్రైవేటు హాస్పిటల్స్ ఆగడాలు ఆగడం లేదు. దీంతో చాలామంది కరోనా రోగులు కాస్త రిస్క్ అయినప్పటికీ హోం ఐసొలేషన్ లో ఉంటూ మందులు వేసుకుంటున్నారు. 

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?