Advertisement

Advertisement


Home > Politics - Political News

శిశుపాలుడు @ ఓవ‌రాక్ష‌న్ నేత‌

శిశుపాలుడు @ ఓవ‌రాక్ష‌న్ నేత‌

మ‌హాభార‌తంలో శిశుపాలుడి క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స‌మ‌స్త లోకాన్ని న‌డిపించే ఆ శ్రీ‌కృష్ణ మ‌హానుభావుడికి స్వ‌యాన మేన‌త్త కుమారుడు. అయితే మాయావి అయిన శ్రీ‌కృష్ణుడు అంటే ఆ శిశుపాలుడికి ఎక్క‌డ లేని కోపం. త‌న‌యుడి చావు మేన‌ల్లుడి చేతిలో ఉంద‌ని తెలుసుకున్న మేన‌త్త .... త‌న కుమారుడికి ప్రాణ‌భిక్ష ప్ర‌సాదించాల‌ని శ్రీ‌కృష్ణుడిని కోరుకుంటుంది.

అప్పుడు శ్రీ‌కృష్ణుడు ఓ చిరు న‌వ్వు న‌వ్వి ... "అత్తా నీ కుమారుడు వంద త‌ప్పుల వ‌ర‌కు క్ష‌మిస్తా, ఆ త‌ర్వాత ఒక్క త‌ప్పు చేసినా వ‌ధిస్తా" అని మేన‌త్త‌కు భ‌రోసా ఇస్తాడు. అయితే త‌ప్పు చేసే మ‌న‌సు ఎవ‌రెన్ని చెప్పినా ఊరుకోదు క‌దా! మూడు లోకాలు ఆరాధించే  శ్రీ‌కృష్ణుడు అంటే లెక్క‌లేని త‌నంతో శిశుపాలుడు వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. అత‌ని త‌ప్పుల‌ను ఆయ‌న న‌వ్వుతూ భ‌రిస్తూ లెక్కిస్తుంటాడు. అయితే తన దెబ్బ‌కు శ్రీ‌కృష్ణుడు భ‌య‌ప‌డుతున్నాడ‌ని, అందువ‌ల్లే తానెంత రెచ్చ‌గొట్టినా ఏమీ చేయ‌లేక పోతున్నాడ‌ని భ్ర‌మ‌ల్లో ఉంటాడు.

మృత్యువుకు స‌మ‌యం ఆస‌న్న‌మైతే ... ఆ య‌మ‌ధ‌ర్మ‌రాజు కూడా ఏమీ చేయ‌లేడ‌ని అంటారు. నిండు స‌భ‌లో భీష్మ‌, ద్రోణాచా ర్యుడు, విధురుడు, కౌర‌వులు, పాండ‌వులు ఆసీనులై ఉండ‌గా ... య‌ధావిధిగా శ్రీ‌కృష్ణుడిని శిశుపాలుడు తూల నాడుతాడు. శ్రీ‌కృష్ణుడిపై దూష‌ణ‌ల‌కు దిగ‌డం మంచిది కాద‌ని పెద్ద‌లంతా వారించినా వినిపించుకోడు. ఎప్పుడైతే వందో త‌ప్పు పూర్తి కాగానే .... శ్రీ‌కృష్ణుడు ఒక్క‌సారిగా త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తాడు. దీంతో స‌భ అంతా ఒక్క‌సారిగా విగ్ర‌హంలా మారిపోతుంది. అంద‌రూ చూస్తుండ‌గానే శిశుపాలుడి త‌లను శ్రీ‌కృష్ణుడు తెగ‌న‌రుకుతాడు.

అయితే ఇప్పుడీ శిశుపాలుడి క‌థ ఎందుకు చెప్పిన‌ట్టు? అనే అనుమానం ఎవ‌రికైనా రావ‌చ్చు. జీవితంలో కొంద మందిని చూస్తే కొన్ని క్యారెక్ట‌ర్లు గుర్తు కొస్తాయి. ఏపీ రాజ‌కీయాల్లో శిశుపాలుడిని పోలిన ఓ ప్ర‌జాప్ర‌తినిధి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.  ఇటీవ‌ల ఆ నేత విప‌రీత పోక‌డ‌ల‌ను చూస్తుంటే ... "రాజుల" కాలం నాటి శిశుపాలుడే గుర్తుకొస్తున్నాడు. తాను అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధి కావ‌డం వ‌ల్లే ... ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇస్తున్న‌ద‌నే స్పృహ కూడా లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. రాజుగా బ‌త‌కాల్సిన నేత ... త‌న స్థాయిని తానే దిగ‌జార్చుకుంటున్నాడ‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

ఇటీవ‌ల కాలంలో ప‌దేప‌దే మ‌తాన్ని ముందుకు తెస్తూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అయితే స‌ద‌రు నేత కోరుకుంటున్న‌ట్టు .... అధికార పార్టీ చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో తీవ్ర నిరాశ‌నిస్పృహ‌ల‌కు లోన‌వు తున్నాడు. దీంతో మ‌రింత ప్ర‌స్ట్రేష‌న్‌కు లోన‌వుతూ ... విచ‌క్ష‌ణ మ‌రిచి నోటి శుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడ‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

శిశుపాలుడిని శిక్షించేందుకు శ్రీ‌కృష్ణుడు వంద త‌ప్పుల టార్గెట్ పెడితే ... స‌ద‌రు నేతను శిక్షించేందుకు ఆ పార్టీ ఎన్ని త‌ప్పులు టార్గెట్‌గా పెట్టుకుంద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. గ‌త కొన్ని నెల‌లుగా ఆయ‌న చేసిన త‌ప్పు ప‌నులెన్నో తేలాల్సి ఉంది. అది తేలే వ‌ర‌కు ఆయ‌న గారిని భ‌రించ‌క త‌ప్ప‌దు.

చంద్రబాబు వైఎస్ఆర్ ఇంటికొచ్చి డబ్బు ఆడిగేవాడు

ఏపీ పోలీస్ సేవ యాప్ ప్రారంభ కార్యక్రమం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?