Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీపై విజ‌య‌సాయి ఘాటైన ట్వీట్లు

టీడీపీపై విజ‌య‌సాయి ఘాటైన ట్వీట్లు

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష టీడీపీపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా తీవ్ర‌స్థాయిలో అటాక్ చేస్తున్నాడు. లోకేశ్‌, విజ‌య‌సాయిరెడ్డి పోటీలు ప‌డి, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. విజ‌య‌సాయి ట్వీట్లు కాస్తా ఘాటుగానే ఉంటున్నాయి.

తాజాగా ఆదివారం ఆయ‌న రెండు ట్వీట్లు చేశాడు. ఎల్లో మీడియాలో వ‌స్తున్న త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. ఏకంగా ఎల్లో బ‌తుకుల గురించి ఆయ‌న ప్ర‌స్తావించాడు.

'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు' అంటూ  విజయసాయిరెడ్డి ట్విట‌ర్‌లో ధ్వజమెత్తాడు. నేవీకి సంబంధించి ఏదో వార్త ఆంగ్ల‌ప‌త్రిక‌లో రావ‌డం, దాన్ని ప‌ట్టుకుని ఆంధ్ర‌జ్యోతి, టీవీ5 తదిత‌ర మీడియా సంస్థ‌లు హ‌డావుడి చేశాయి. సాయంత్రానికి అలాంటిదేమీ లేద‌ని నేవీ ఖండించింది. దీంతో ఎల్లో మీడియా గాలి పోయింది. దానిపై విజ‌య‌సాయి సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యాడు.

మరో ట్వీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.

'మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమవుతున్న వారు తమ భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారంటూ' విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు.

ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు విజ‌య‌సాయిరెడ్డి పొలిటిక‌ల్‌గా అప్‌డేట్ అవుతూ త‌న‌దైన శైలిలో ట్విట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందిస్తున్నాడు. వైసీపీ శ్రేణుల్ని ఆయ‌న ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు.

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?