Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్లాస్టిక్ భూతానికి చెక్ అంటున్న విశాఖ?

ప్లాస్టిక్ భూతానికి చెక్ అంటున్న విశాఖ?

ప్లాస్టిక్ ఇపుడు ప్రపంచంలో అతి ముఖ్యమైన వస్తువుగా మారింది. అది లేని చోటు లేదు. అన్ని అవసరాలకు ప్లాస్టిక్ కావాల్సివస్తోంది. అభివృద్ధి అంటే ప్లాస్టిక్ తోనే అన్న విధంగా జనాల మైండ్ సెట్ తయారైంది.

మరి ప్లాస్టిక్ ని పెను భూతంగా పర్యావరణవేత్తలు చెబుతారు. ఎదుగుతున్న నగరాలు సుందరంగా ఉండాలన్నా, పర్యావరణహితంగా ముందుకుసాగాలన్నా ప్లాస్టిక్ భూతాన్ని వదిలించుకోవడమే శరణ్యం అని చెబుతారు.

ఇపుడు అదే పనిలో మహా విశాఖ కార్పొరేషన్ ఉంది. విశాఖలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించడంతో పాటు చెత్త మీద కూడా సమరానికి జీవీఎంసీ అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. ఎవరైనా చెత్త వేస్తే వారి మీద భారీ జరీమానా విధించాలన్న కఠిన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు.

ఇక విశాఖ సహజసిద్ధమైన అందాలను కాపాడుతూ బ్యూటీ సిటీగా తీర్చిదిద్దడానికి కూడా పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. మొత్తానికి సిటీ ఆఫ్ డెస్టినీ అన్న మాటకు అసలైన అర్ధంగా విశాఖను తీర్చిదిద్దబోతున్నారు అన్న మాట. మరి దీనికి ప్రజలంతా సహకరిస్తే భువిలో వెలసిన సుందర నగరమే  విశాఖ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?