Advertisement

Advertisement


Home > Politics - Political News

చైతూ-సమంత వ్యవహారం.. నాగార్జునపై ప్రభావం

చైతూ-సమంత వ్యవహారం.. నాగార్జునపై ప్రభావం

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య-సమంత వైవాహిక జీవితానికి సంబంధించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో చెలరేగుతున్నాయో అందరికీ తెలుసు. వీళ్లిద్దరి వైవాహిక జీవితంలో ఆటుపోట్లు వచ్చాయని, త్వరలోనే విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వారం రోజులుగా ఓ రేంజ్ లో హంగామా నడుస్తోంది.

దీనిపై ఇప్పటివరకు సమంత స్పందించలేదు. పరోక్షంగా పోస్టులు మాత్రం పెడుతోంది. అటు నాగచైతన్య అయితే కనీసం కెమెరా కంటికి కూడా కనిపించలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాగార్జున మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. దీనికి కారణం బిగ్ బాస్ సీజన్-5. 

ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున ప్రెస్ మీట్ పెట్టారు. బిగ్ బాస్ తో పాటు తన సినిమాల గురించి మాట్లాడేవారు. కానీ ఈసారి మాత్రం నాగచైతన్య-సమంత వ్యవహారం కారణంగా.. ప్రెస్ మీట్ ను స్కిప్ చేశారు నాగ్. అడిగితే కరోనాను సాకుగా చూపించారు. ఏకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లే జరుగుతున్న ఈ టైమ్ లో కరోనా కారణంగా ప్రెస్ మీట్ రద్దు చేయడం ఏంటని అంతా నవ్వుకున్నారు.

ఇక ఈ రోజు సాయంత్రం నుంచి బిగ్ బాస్ సీజన్-5 హంగామా షురూ కాబోతోంది. ఈసారి రెండు పెద్ద మార్పులతో స్టార్ మా యాజమాన్యం రంగంలోకి దూకింది. అందులో ఒకటి బిగ్ బాస్ షో టైమింగ్స్ మార్చేసింది. తమ సూపర్ హిట్ సీరియల్స్ టైమింగ్స్ మార్చకుండా.. బిగ్ బాస్ ను రాత్రి 10 గంటలకు షిఫ్ట్ చేసింది. శని-ఆదివారాలు మాత్రం రాత్రి 9 గంటలకు షెడ్యూల్ చేసింది.

ఇక రెండో అతిపెద్ద మార్పు ఏంటంటే.. ప్రతి సీజన్ లో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం వెదికే యాజమాన్యం, ఈసారి మాత్రం సినీప్రముఖుల్ని లైట్ తీసుకుంది. కొంతమందిని హౌజ్ లోకి తీసుకున్నప్పటికీ, స్టార్ ఎట్రాక్షన్ కోసం మాత్రం తహతహలాడలేదు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నవాళ్లను హౌజ్ లోకి  ప్రవేశపెట్టబోతోంది.  

యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, నటరాజ్ మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ, ఆనవాయితీ ప్రకారం టీవీ9 నుంచి ఓ యాంకర్ ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీళ్లతో పాటు స్టార్ సింగర్ శ్రీరామచంద్ర కూడా హౌజ్ లో అడుగుపెట్టబోతున్నాడనే టాక్ నడుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?