Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Political News

వైఎస్ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని చేపట్టనున్న జగన్

వైఎస్ చేపట్టాలనుకున్న కార్యక్రమాన్ని చేపట్టనున్న జగన్

త్వరలోనే 'రచ్చబండ' కార్యక్రమాన్ని  ప్రారంభించనున్నట్టుగా ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కలెక్టర్లతో జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ కార్యక్రమం ద్వారా ఎక్కడిక్కడ ప్రజా  సమస్యల పరిష్కారానికి తనే రంగం దిగబోతున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

'రచ్చబండ' కార్యక్రమం అనగానే.. గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి. 'రచ్చబండ' కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళ్తూనే ఆయన మరణించారు. చిత్తూరు జిల్లాలో ఆ కార్యక్రమాన్ని చేపట్టడానికి వెళ్తూ, హెలీకాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన సంగతి తెలిసిందే. రెండోసారి అధికారం దక్కాకా పాలనను మరింతగా పరుగులు పెట్టించడానికి  వైఎస్ రాజశేఖర రెడ్డి 'రచ్చబండ' కార్యక్రమాన్ని చేపట్టాలని  భావించారు.

సాధారణంగా తను చేపట్టిన వివిధ కార్యక్రమాలను చేవేళ్ల నుంచి మొదలుపెట్టేవారు రాజశేఖర రెడ్డి. అయితే 'రచ్చబండ' కార్యక్రమాన్ని మాత్రం చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టాలని భావించారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ లో అందుకు ప్రయాణం అయ్యారు. అలాగే  దివికెగేరాయన. అలా 'రచ్చబండ' కార్యక్రమం ప్రారంభించకుండానే ముగిసింది.

ఇప్పుడు ఆయన తనయుడు  ముఖ్యమంత్రి అయ్యారు. 'రచ్చబండ' పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?