శివాజీ పెద్ద హీరో, ఆయనను కామెంట్ చేయను!

'శివాజీ పెద్ద హీరో.. ఆయన గురించి కామెంట్ చేసేంతస్థాయి నాకు లేదు..' అన్నట్టుగా మాట్లాడి సెటైర్లు వేశారు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తన ఆరోగ్యం బాగా ఉందని క్లారిటీ ఇచ్చేందుకు ప్రెస్ మీట్…

'శివాజీ పెద్ద హీరో.. ఆయన గురించి కామెంట్ చేసేంతస్థాయి నాకు లేదు..' అన్నట్టుగా మాట్లాడి సెటైర్లు వేశారు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి. తన ఆరోగ్యం బాగా ఉందని క్లారిటీ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన పోసాని వివిధ అంశాల గురించి కూడా మాట్లాడారు. జగన్ పాలన మీద లోకేష్ ట్వీట్లు, శివాజీ వ్యవహారం గురించి పోసాని స్పందించారు. గతంలో కూడా శివాజీ మీద పోసాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశం గురించి మీడియా కోరగా పోసాని స్పందించారు. 'శివాజీ గురించి స్పందించేంత స్థాయి నాది కాదు, ఆయన పెద్ద హీరో..' అంటూ పోసాని పంచ్ లు వేశారు.

'చంద్రబాబు గురించి శివాజీ మొదట ఏం చెప్పారు, ఆ తర్వాత ఏమన్నారు? జగన్ గురించి అదే శివాజీ మొదట ఏమన్నారు, తర్వాత ఏమన్నారు.. అనే అంశాల గురించి మాత్రమే నేను అప్పుడు మాట్లాడా.. అంతకు మించి ఆయన గురించి కామెంట్ చేసేంత గొప్పోడిని కాదు..' అన్నట్టుగా మాట్లాడారు పోసాని. ఇక వైఎస్ జగన్ పాలన లోకేష్ కు నచ్చాల్సిన అవసరం లేదని పోసాని వ్యాఖ్యానించారు. జగన్ పాలన ఎలాగూ లోకేష్ కు నచ్చదు అని కూడా పోసాని అన్నారు.

'జగన్ ఇసుక దోచుకొమ్మని అనడంలేదు. చంద్రబాబు నాయుడు నది ఒడ్డు మీద ఉన్న ఇంట్లోనే కాపురం చేయడానికి జగన్ ఒప్పుకోవడం లేదు.. ఇలాంటి పాలన లోకేష్ కు ఎలా నచ్చుతుంది?' అని పోసాని ప్రశ్నించారు. జగన్ పాలన నచ్చాల్సింది లోకేష్ కు కాదని, ప్రజలకు అని, వారికి జగన్ పాలన నచ్చుతోందని.. లోకేష్ తో అనవసరం అన్నట్టుగా పోసాని అన్నారు.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!