పోసాని కృష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే. పొరపాటున ఆయన ఎవరి గురించైనా మాట్లాడను అని చెప్పినా అది కూడా సంచలనమే. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడే అతికొద్దిమంది రాజకీయ, సినీ ప్రముఖుల్లో పోసాని కూడా ఒకరు. తాజాగా ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవవ్ కల్యాణ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆయన రెస్పాన్స్ కి మీమ్స్ క్రియేట్ చేసి జనసేనానిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. బీజేపీతో జనసేన కలయిక గురించి మీ స్పందన ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు “ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక” అంటూ ఓ లిరిక్ పాడి సెటైర్ వేశారు పోసాని. అంటే పవన్ గురించి మాట్లాడ్డం మీకిష్టంలేదా అని రెట్టించాడు సదరు యాంకర్. దానికి కూడా తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు పోసాని.
ఇష్టపడ్డానికి ఏముంది, కామెంట్ చేయడానికి ఏముంది అంటూ పవన్ ని మరింతగా తీసిపారేశారు. జనసేన-బీజేపీ కలయిక గురించి రాష్ట్రమంతా తెలుసు, అందరికీ తెలిసిన విషయాన్ని నేనేం చెప్పను. ఇంకా నాకే ఎక్కువగా తెలియదు, అందుకే నాకు ఇంట్రస్ట్ లేదు అని చెప్పుకొచ్చారు పోసాని. మొత్తానికి పవన్ కల్యాణ్ ని కామెంట్ చేయకుండానే, పవన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండానే.. పూర్తిగా ఆయన గాలి తీసిపారేశారు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ బిట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కర్పూరాన్ని పట్టించుకోని పోసాని అంటూ.. అత్తారింటికి దారేది క్లిప్పులు జతచేసి సూపర్ గా కామెడీ చేస్తున్నారు. మొత్తమ్మీద పవన్ గురించి పోసాని మాట్లాడకుండానే.. దాన్ని పెద్ద కామెడీ చేసిపారేశారు.